పవర్ స్టార్‌తో బిగ్ బాస్ ముద్దుగుమ్మ హిమ‌జ‌.!

February 25, 2021 at 12:50 pm

‌బిగ్ బాస్ సీజ‌న్ 3లో పాల్గొని అంద‌రి దృష్టి తన వైవు తిప్పుకున్న అందాల ముద్దు గుమ్మ హిమ‌జ‌. చూడటానికి చాలా సైలెంట్‌గా కనిపించినా, ఆవేవం వ‌స్తే అవ‌త‌లి వారి తాట తీయటం ఖాయం. బిగ్ బాస్ ఇంటి నుండి బ‌య‌ట‌కు వ‌చ్చాక హిమ‌జ లైఫ్ కంప్లీట్ చేంజ్ అయిపొయింది. ల‌గ్జ‌రీ కారు మెయింటైన్ చేస్తూ విలాస‌వంత‌మైన లైఫ్ గడుపుతుంది. ప‌లు చిత్రాల్లోనూ న‌టిస్తున్న హిమ‌జ త‌న సోష‌ల్ మీడియా ద్వారా ఎప్పుడు అభిమానులతో ట‌చ్‌లో ఉంటుంది.

హిమ‌జ రీసెంట్‌గా మ‌హేష్ బాబుతో దిగిన ఫొటోని త‌న సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌గా, అది వైర‌ల్‌గా మారింది. ఇక తాజాగా ప‌వర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను ఏదో సంద‌ర్భంలో క‌లిసి అతనితో పిక్ దిగింది. ఒక ఫొటోలో ప‌వ‌న్ కళ్యాణ్ సీరియ‌స్ లుక్‌లో కనిపించగా, మ‌రో పిక్ లో నవ్వుతూ క‌నిపించారు. ఈ ఫొటోలు నెటిజ‌న్స్‌ను బాగా ఆక‌ట్టుకుంటున్నాయి.

పవర్ స్టార్‌తో బిగ్ బాస్ ముద్దుగుమ్మ హిమ‌జ‌.!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts