బోనీతో అతిలోక సుందరి ఎలా ప్రేమలో పడిందంటే..?

February 26, 2021 at 2:06 pm

తెలుగులో నాటి తరం అగ్ర హీరోయిన్లలో శ్రీదేవి కూడా ఒకరు. అందం అభినయంతో ఆ కాలంలో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న నటి ఆమె. చైల్డ్ ఆర్టిస్టుగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఆమె అతిలోక సుందరిగా మారిపోయారు. సినిమాల్లో ఆమె అవకాశం కోసం పెద్ద పెద్ద నిర్మాతలంతా క్యూ కట్టారంటే అతిశయోక్తి కాదు. అలాంటి హీరోయిన్ బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ ను వివాహం చేసుకున్నారు. అయితే బోని కపూర్ కు ఇది వరకే పెళ్లయింది. మరి శ్రీదేవి బోనీల మధ్య ప్రేమ ఎలా అయ్యింది. ఎవరు ఎవరికి ప్రపోజ్ చేశారు అనే ఇంటరెస్టింగ్ స్టోరీ ఇక్కడ చదివి తెలుసుకోండి. 1980 దశకంలో శ్రీదేవి సౌత్ ఇండియాలో పెద్ద నటి. అంతే కాకుండా ఆమె ప్రతీ సినిమాకు అప్పట్లో లక్షల్లో రెమ్యూనరేషన్ తీసుకునేవారు. రజనీకాంత్ కమలహాసన్ లాంటి వారు ఆమె డేట్స్ కోసం తమ షూటింగ్ ను వాయిదా వేసుకునే వారు. అలంటి టైములో ప్రముఖ బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ తన సినిమాలో శ్రేదేవిని నటింపజేసేందుకు డేట్స్ కోసం ఆమె ఇంటి చుట్టూ చక్కర్లు కొట్టేవారు. ఎన్నో రోజులుగా శ్రీదేవి కోసం తిరగగా చివరికి శ్రీదేవిని బోనీ కపూర్ కలిసే అవకోసం వచ్చింది.

అయితే బోనీ సినిమాలో నటించాలంటే రూ.10 లక్షల రెమ్యూనరేషన్ అడిగారు. దానికి బోనీ కపూర్ రూ.11 లక్షలు ఇస్తానని చెప్పారు. దీంతో బోనీ తీయబోయే మిస్టర్ ఇండియా మూవీకి శ్రీదేవి ఓకే చెప్పింది. ఆ తరువాత శ్రీదేవిని కలిసేందుకు బోనీ ఆమె షూటింగ్ స్పాట్ కు కూడా వెళ్లేవారు. చాంద్ నీ మూవీ షూటింగ్ కోసం ఏకంగా స్విట్జర్లాండ్ ప్లైట్ ఎక్కి శ్రీదేవి కోసం వెళ్లారు అంట. అప్పటికే తండ్రిని కోల్పోయిన శ్రీదేవి తల్లి కూడా అనారోగ్యం బారిన పడటంతో, ఆమెకు బ్రెయిన్ సర్జరీ కోసం అమెరికాకు వెళితే ఆమె వెంట బోనీ కూడా వెళ్లాడు. ఆ తరువాత ఆమె మరణించడంతో శ్రీదేవికి బోనీ అండగా ఉన్నాడు. ఈక్రమంలో శ్రీదేవి కూడా బోనీ కపూర్ ను ప్రేమించసాగింది. దీంతో వీరు 1990లో వివాహం చేసుకున్నారు.కానీ బోనీ కపూర్ కు అప్పటికే భార్య ఇంకా పిల్లలు ఉన్నారు. దీంతో శ్రీదేవి కి కొంచెం ఇబ్బందులు ఎదురు ఆయాయ్యి. శ్రీదేవితో బోనీ కపూర్ మిస్టర్ ఇండియా, రూప్ కీ రాణి రోరోం కా రాజా, మామ్ వంటి చిత్రాలు చేశారు.

బోనీతో అతిలోక సుందరి ఎలా ప్రేమలో పడిందంటే..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts