న‌కిలీ ఈ-మెయిల్స్ కేసులో హృతిక్ రోష‌న్ వాంగ్మూలం..!!

February 27, 2021 at 2:43 pm

ఫేక్ ఈ మెయిల్స్ కేసులో బాలీవుడ్ ప్రముఖ హీరో హృతిక్ రోష‌న్ నేడు ముంబై పోలీసు క‌మీష‌న‌ర్ ఆఫీసు ముందు హాజ‌ర‌య్యారు. 2016 ఫిర్యాదుకు సంబంధించిన కేసులో ఆయ‌న క్రైం బ్రాంచ్ పోలీసుల‌కు వాంగ్మూలం ఇచ్చారు. హీరోయిన్ కంగ‌నా ర‌నౌత్‌కు ఓ బోగ‌స్ ఐడీ ద్వారా ఈ మెయిల్స్ చేసిన‌ట్లు హృతిక్ ‌పై కొన్ని ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఆ సంవత్సరం కంగ‌నా, హృతిక్ మ‌ధ్య సోష‌ల్ మీడియాలో గొడ‌వ కూడా న‌డిచింది. కంగ‌నా పై ఓ ద‌శ‌లో హృతిక్ అనుచిత కామెంట్ చెయ్యగా దానికి ఆమె లీగ‌ల్ నోటీసులు కూడా హృతిక్ కి పంపారు.

కంగ‌నాకి త‌న‌కు మధ్య ఎటువంటి రిలేష‌న్‌షిప్ లేద‌ని, ఆమె కూడా త‌న‌కు వంద‌ల సంఖ్య‌లో మెయిల్స్ పంపిన‌ట్లు హృతిక్ వెల్ల‌డించారు. కానీ త‌న పేరుతో ఎవ‌రో ఆమెకు ఈ మెయిల్స్ పంపుతున్నార‌ని హృతిక్ ఫిర్యాదు చేశాడు. హృతిక్ ఇచ్చిన ఫిర్యాదుకు పోలీస్ వారు చీటింగ్ కేసు న‌మోదు చేశారు. 2016 సంవత్సరంలో సైబ‌ర్ సెల్‌ వారు హీరో హృతిక్ ల్యాప్‌టాప్‌, ఫోన్‌ను సీజ్ చేశారు.

న‌కిలీ ఈ-మెయిల్స్ కేసులో హృతిక్ రోష‌న్ వాంగ్మూలం..!!
0 votes, 0.00 avg. rating (0% score)