టీమిండియాకు ఇంగ్లాండ్ వ‌రుస షాకులు.. లంచ్‌ బ్రేక్ టైమ్‌కు స్కోర్ ఎంతంటే!

February 15, 2021 at 12:15 pm

చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా భారీ ఆధిక్యంతో మూడో రోజు మ్యాచ్‌ ప్రారంభించిన టీమిండియాకు ఆదిలోనే ఇంగ్లాండ్ బౌల‌ర్లు వ‌రుస షాకులు ఇస్తున్నారు. మ్యాచ్‌ ప్రారంభించిన కాసేపటికే పుజారా, రోహిత్‌ శర్మ, రిషబ్‌ పంత్, అజింకా రహానే, అక్సర్‌ పటే ఇలా టీమిండియా బ్యాట్స్‌మెన్లు వరుసగా పెవిలియన్‌ బాట పట్టారు.

ఇక వరుస వికెట్లు కోల్పోయిన భారత జట్టును ఆదుకునేందుకు టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ప్ర‌య‌త్నిస్తుంగా.. టెయిలెండర్ గా వచ్చిన స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన సొంత గడ్డపై ఇంగ్లండ్ బౌలర్లను ఓ ఆట ఆడుకున్నాడు. అశ్విన్ ను పెవీలియన్ కు పంపేందుకు ఇంగ్లండ్ బౌలర్లు చేసిన ప్రయతనాలు విఫలం అయ్యాయి.

ఈ క్ర‌మంలోనే 86 బంతుల్లో స్టార్ బ్యాట్స్ మెన్ కోహ్లీ 38 పరుగులు మాత్రమే చేయగలిగిన వేళ, తానాడిన 38 బంతుల్లోనే అశ్విన్ 34 పరుగులు సాధించాడు. దీంతో మూడో రోజు భోజన విరామ సమయానికి టీమిండియా 156/6 పరుగుల వద్ద కొనసాగుతోంది. ఇక ప్రస్తుతం భారత్‌ 351 పరుగుల ఆధిక్యంలో ఉంది. ప్రస్తుతం అశ్విన్ 34, కోహ్లీ 38 పరుగులతో క్రీజులో ఉన్నారు.

టీమిండియాకు ఇంగ్లాండ్ వ‌రుస షాకులు.. లంచ్‌ బ్రేక్ టైమ్‌కు స్కోర్ ఎంతంటే!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts