చెన్నై టెస్టులో విజ‌యానికి అతి చేరు‌వ‌లో భార‌త్‌..పీక‌ల్లోతు క‌ష్టాల్లో ఇంగ్లాండ్‌!

February 16, 2021 at 12:14 pm

చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా ఇంగ్లండ్‌తో​ జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా అద‌ర‌గొట్టేస్తోంది. రెండు టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ నాలుగో రోజు ఆటను ప్రారంభించ‌గా.. మ్యాచ్‌ స్టార్ట్ అయిన కాసేపట్లోనే భార‌త్ బౌల‌ర్లు విజృంభిస్తుండ‌డంతో వ‌ర‌స‌గా వికెట్లు సమర్పించింది.

ముఖ్యంగా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన బౌలింగ్‌తో ఇంగ్లండ్ జట్టును హడలెత్తిస్తున్నాడు. ఇక లంచ్ ముగిసే సమయానికి ఇంగ్లండ్ ఏడు వికెట్లు కోల్పోయి 116 పరుగులు చేసి.. పీక‌ల్లోతు క‌ష్టాల్లో కూరుకుంది. లంచ్ బ్రేక్ స‌మ‌యానికి క్రీజులో కెప్టెన్‌ రూట్స్ 33 ప‌రుగుల‌తో క్రీజులో ఉన్నాడు.

ఇప్ప‌టి వ‌ర‌కు భార‌త్ బౌల‌ర్ల‌లో అశ్విన్‌, అక్ష‌ర్ ప‌టేల్ త‌లో మూడు వికెట్లు తీయ‌గా, కుల్‌దీప్ ఒక వికెట్ ప‌డ‌గొట్టాడు. అయితే ఈ మ్యాచ్‌ గెలవాలంటే ఇంగ్లండ్ ఇంకా 366 పరుగులు చేయాల్సి ఉంది. కానీ, భారత్‌ మాత్రం విజయానికి అతి చేర‌వ‌లో నిలిచింది. మరో మూడు వికెట్లు పడగొట్టినట్లయితే టీమిండియా విజయం సాధిస్తుంది.

చెన్నై టెస్టులో విజ‌యానికి అతి చేరు‌వ‌లో భార‌త్‌..పీక‌ల్లోతు క‌ష్టాల్లో ఇంగ్లాండ్‌!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts