అరుదైన గౌరవం సొంతం చేసుకున్న భారతీయ మహిళ..!?

February 24, 2021 at 12:50 pm

మన భారతీయ మహిళకు పెద్ద అరుదైన గౌరవం దక్కబోతోంది. ఆమె సేవలను గుర్తించిన అమెరికా సర్కారు ప్రత్యేక అవార్డుతో ఆమెను సత్కరించనుంది. ఆమెతో పాటు ప్రపంచ వ్యాప్తంగా మరో 11 మందికి కూడా ఈ అవార్డులను అందివ్వనుంది. ఈ మేరకు మంగళవారం నాడు అమెరికా సర్కారు ఓ ముఖ్య ప్రకటన చేసింది. ఆ ప్రకటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ప్రపంచ దేశాల్లో అవినీతి నిరోధానికి కృషి చేసిన వారికి అమెరికా ప్రభుత్వం అవార్డులను ప్రకటిస్తూ ఉంది. ఈ క్రమంలోనే తాజాగా 12 మంది అవినీతి నిరోధక ఉద్యమకారులు, సామాజిక సేవాకారుల జాబితాను అగ్రరాజ్యం ప్రకటించింది. ఈ జాబితాలో భారత్ కు చెందిన అంజలీ భరద్వాజ్ స్థానం దక్కించుకున్నారు. 48 ఏళ్ల సామాజిక ఉద్యమకారిణి అయిన ఆమె, గత రెండు దశాద్దాలుగా వివిధ సమస్యలపై పోరాటం చేస్తున్నారు.

ప్రభుత్వ విభాగాల్లో పారదర్శకతను పెంపొందించడం, ఇంకా అదే సమయంలో ప్రభుత్వాలు జవాబు దారీతనంతో కలిగి ఉండేందుకు అంజలీ భరద్వాజ్ ఎంతగవునో కృషి చేస్తున్నారు. దీనికోసం సతర్క్ నగ్రీక్ సంఘటన్ అనే సంస్థను కూడా అంజలి స్థాపించారు. ఈ నేపథ్యంలో అనేక విజయాలను కూడా ఆమె అందుకున్నారు. ఆమె చేసిన కృషిని బైడెన్ సర్కారు గుర్తించి, ఆమెతో పాటు ప్రపంచ వ్యాప్తంగా మరో 11 మందికి యాంటీ కరప్షన్ ఛాంపియన్స్ అవార్డుకు వారు ఎంపిక చేసారు. అవినీతి అక్రమాలను నిర్మూలించేందుకు, ప్రభుత్వంలో జవాబు దారీ తనాన్ని కల్గించేందుకు ఎంతగానో కృషి చేస్తున్న వారందరినీ తాము సత్కరించబోతున్నాం అంటూ యూఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ టోనీ బ్లింకెన్ మంగళవారం నాడు ఓ ప్రకటనలో తెలిపారు.

అరుదైన గౌరవం సొంతం చేసుకున్న భారతీయ మహిళ..!?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts