‘వణక్కండా మాప్ల’ ఫస్ట్‌లుక్‌ పోస్టర్ రిలీజ్..!

February 26, 2021 at 11:00 am

ప్రముఖ కోలీవుడ్‌ సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్‌ హీరోగా బిజీ అయిపోయారు. ఒకవైపు పలు సినిమాలకు సంగీతం సమకూరుస్తూనే మరో వైపు తనకు వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటూ ముందుకు దూసుకుపోతున్నారు .ఈ కోవలోనే పలు సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. తాజాగా వణక్కండా మాప్ల అనే సినిమాలో ఆయన హీరోగా నటిస్తున్నారు. శివ మనసుల శక్తి, ఒరు కల్‌ ఒరు కణ్ణాడి వంటి పలు సినిమాలకు దర్శకత్వం వహించిన ఎం.రాజేష్‌ ఈ మూవీకి దర్శకత్వం వహించనున్నారు.

ఇందులో జీవీ ప్రకాష్‌ హీరోగా నటిస్తూనే అటు సంగీతం కూడా సమకూరుస్తున్నారు. ఈయన సరసన అమృతను కథానాయకి గా ఎంపిక చేశారు. అలాగే, బిగ్‌ బాస్ ఫేం డేనియల్‌, రేష్మా తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. పూర్తి హాస్య భరిత చిత్రంగా తయారయ్యే ఈ మూవీ నేరుగా థియేటర్లలో కాకుండా, బుల్లితెర పై రిలీజ్ చేయనున్నారు. ఈ మూవీ ఫస్ట్‌ లుక్‌ను తాజాగా రిలీజ్ చేశారు మేకర్స్.

‘వణక్కండా మాప్ల’ ఫస్ట్‌లుక్‌ పోస్టర్ రిలీజ్..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts