సూసైడ్‌కు పాల్ప‌డిన‌ యువతి..చిన్న‌ పొరపాటుతో కుమారుడు, సోదరి బ‌లి!

February 25, 2021 at 10:50 am

ఇటీవ‌ల కాలంలో ఆత్మ‌హ‌త్య‌లు రోజురోజుకు విప‌రీతంగా పెరుగుతున్నాయి. ఇంట్లో వారు తిట్టార‌నో, ప‌రీక్ష‌లో ఫేల్ అయ్యామ‌‌నో, ఉద్యోగం రాలేద‌నో ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డుతున్నారు. తాజాగా ఓ యువ‌తి కూడా సూసైడ్ పాల్ప‌డింది. ఈ క్ర‌మంలోనే ఆమె చేసిన చిన్న పొర‌పాటు వ‌ల్ల కుమారుడు, సోద‌రి బ‌లైపోయారు.

పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే..కేరళలో తిరువనంతపురం సమీపంలో ఉంటున్న ఓ మహిళ ఏవో కార‌ణాల వ‌ల్ల ఆత్మహత్య చేసుకోవాలని భావించింది. ఎలుకలను నిర్మూలించే మందును కొనుక్కుని వచ్చి.. ఐస్ క్రీమ్ లో క‌లిపింది. కానీ, మొత్తం ఐస్ క్రీమ్ ను ఆమె తినలేక.. కొంత తిన మిగిలింది అక్కడే వదిలేసింది.

ఇక ఐస్ క్రీమ్ కనిపించే సరికి దానిలో విషం ఉందని తెలియని ఆమె కుమారుడు, 19 ఏళ్ల చెల్లెలు దాన్ని తినేశారు. విష ప్రభావంతో వారిద్దరూ మ‌ర‌ణించ‌గా.. సూసైడ్‌కు పాల్ప‌డిన‌ మహిళ మాత్రం హాస్ప‌ట‌ల్‌లో ప్రాణాలు నిలుపుకుంది. విష‌యం తెలుసుకున్న పోలీసులు.. కేసు న‌మోదు చేసి విచార‌ణ చేప‌ట్టారు.

సూసైడ్‌కు పాల్ప‌డిన‌ యువతి..చిన్న‌ పొరపాటుతో కుమారుడు, సోదరి బ‌లి!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts