
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. ఈయనకు తెలుగు ఇండస్ట్రీలోనే కాదు కేరళలో కూడా సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందన్న సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ నటించిన సినిమాలు తెలుగులో ఫ్లాప్ అయినా కూడా కేరళలో బ్లాక్బస్టర్ హిట్ అయ్యాయి. అంటే కేరళలో బన్నీకి ఏ స్థాయిలో క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు.
అయితే ఆ ఫాలోంగ్నే కేరళ పోలీసులు అద్భుతంగా వాడుకున్నారు. తాజాగా కేరళ పోలీసులు ప్రజలకు రక్షణ కల్పించేందుకుగాను ‘పోల్’ పేరుతో ఓ యాప్ను తీసుకొచ్చారు. కష్టాల్లో, ఆపదలో ఉన్న వారెవరైనా ఈ యాప్ ద్వారా చిన్న సందేశం పంపిస్తే చాలు వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకునే వ్యవస్థను తీసుకొచ్చారు.
అయితే ఈ యాప్ ప్రచారం కోసమే బన్నీని ఉపయోగించుకున్నారు కేరళ పోలీసులు. రేసుగుర్రం సినిమాలో హీరో తన కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం పోలీస్ డ్రెస్లో బైక్పై మెరుపులా వస్తాడు. అచ్చంగా అలాగే కేరళ పోలీసులు కూడా మీరు ఏ ప్రమాదంలో ఉన్నా కూడా సమయానికి వచ్చి కాపాడతారు అని చెప్పడమే ఈ పోల్ యాప్ ఉద్దేశ్యం అని వివరించాడు. దీంతో ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.
പോൽ ആപ്പ് – പോലീസ് സേവനങ്ങൾ ഇനി ഒരു കുടക്കീഴിൽ pic.twitter.com/I9Pwx9Q8uc
— Kerala Police (@TheKeralaPolice) February 19, 2021