
కృతి శెట్టి.. ప్రస్తుతం ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. `ఉప్పెన` సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన కృతి.. మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.
ఈ సినిమాలో కృతి చూపించిన అందం, అభినయం, డైలాగ్ డెలివరీ తెలుగు ప్రేక్షకులను, సినీ తారలను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇక ఉప్పెన విడుదలకు ముందే రెండు సినిమాలకు సైన్ చేసిన కృతికి.. ప్రస్తుతం మరిన్ని ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి.
ఇదిలా ఉంటే.. ప్రస్తుతం కృతి చిన్నప్పటి ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోల్లో కృతి సూపర్ క్యూట్‌గా కనిపిస్తూ.. యూత్ మతిపోగొట్టేస్తోంది. మరి ఆ ఫొటోలపై మీరు కూడా ఓ లుక్కేసేయండి.