బేబమ్మకు బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఎన‌ర్జిక్ స్టార్‌తో రొమాన్స్‌?

February 18, 2021 at 1:27 pm

`ఉప్పెన‌` సినిమాతో బేబ‌మ్మ‌గా సూప‌ర్ క్రేజ్ ఏర్ప‌ర్చుకున్న కృతి శెట్టి గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. మొద‌టి సినిమాతోనే సూప‌ర్ డూప‌ర్ హిట్ అందుకున్న ఈ బ్యూటీకి వ‌రుస ఆఫ‌ర్లు త‌లుపుత‌డుతున్నాయి.

ఇప్ప‌టికే నాని `శ్యామ్ సింగ‌‌రాయ్‌`, సుధీర బాబు సినిమాతో పాటుగా మ‌రి ప్రాజెక్ట్స్‌ను లైన్‌లో పెట్టిన కృతి శెట్టికి.. తాజాగా మ‌రో బంప‌ర్ ఆఫ‌ర్ వ‌చ్చింది. టాలీవుడ్ ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని రెడ్ త‌ర్వాత కోలీవుడ్ సెన్సేషనల్ దర్శకుడు ఎన్ లింగుసామితో సినిమా చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.

ఎస్ ఎస్ స్క్రీన్స్ బ్యానర్ లో శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగుతోపాటు తమిళంలోనూ విడుదల కానుకండి. అయితే ఈ చిత్రంలో రామ్‌కు జోడీగా కృతిని ఎంపిక చేసిన‌ట్టు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల స‌మాచారం ద్వారా తెలుస్తోంది. మ‌రి ఇందులో ఎంత వ‌ర‌కు నిజ‌ముందో త్వ‌ర‌లోనే తెలియ‌నుంది.

బేబమ్మకు బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఎన‌ర్జిక్ స్టార్‌తో రొమాన్స్‌?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts