లీకైన‌ `మహా సముద్రం` స్టోరీ.. నెట్టింట్లో వైర‌ల్‌!

February 22, 2021 at 11:32 am

ఆర్ఎక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి ప్ర‌స్తుతం శర్వానంద్, సిద్దార్థ్ హీరోలుగా `మ‌హా స‌ముద్రం` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. అదితిరావు హైదరీ, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై అనిల్‌ సుంకర నిర్మిస్తున్నారు.

ప్రపంచ వ్యాప్తంగా ఆగస్టు 19న మహాసముద్రం ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు పేర్కొంది. అయితే తాజాగా ఈ సినిమా స్టోరీ లీక్ అయింది. చిన్నప్పుడు ఇద్దరు కుర్రాళ్ళు కొన్ని కారణాల వల్ల ఒకరిపై ఒకరు ద్వేషం పెంచుకుంటారు. అలా ద్వేషం పెంచుకున్న ఇద్దరు ఆవేశపరుల మధ్య జరిగే కథ అని తెలుస్తోంది.

ఇక శ‌ర్వా మ‌రియు సిద్దార్థ్‌ల మ‌ధ్య భారీ యాక్షన్ సీన్స్ తో పాటు ఒక రొమాంటిక్ లవ్ స్టోరీ కూడా ఈ సినిమాలో ఉంటుంద‌ట‌. అంతేకాదు, ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర చనిపోతుందని తెలుస్తోంది. ఇందులో ఎంత వ‌ర‌కు నిజ‌ముందో తెలియ‌దు గానీ.. ప్ర‌స్తుతం ఈ స్టోరీ నెట్టింట్లో వైర‌ల్ అవుతోంది.

లీకైన‌ `మహా సముద్రం` స్టోరీ.. నెట్టింట్లో వైర‌ల్‌!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts