సితార కొత్త‌ ట్యాలెంట్..ఆశ్చ‌ర్య‌పోతున్న మ‌హేష్ ఫ్యాన్స్‌!

February 23, 2021 at 10:28 am

టాలీవుడ్ ప్రిన్స్‌, సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు గారాల ప‌ట్టి సితార గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. చిన్న వ‌య‌సులోనే తండ్రి స్థాయిలో ఫాలోయింగ్ సంపాదించుకున్న‌ సితార‌.. సోష‌ల్ మీడియాలో య‌మా యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్ప‌టిక‌ప్పుడు సోష‌ల్ మీడియా ద్వారా త‌న ఫొటోల‌ను, డ్యాన్స్ వీడియోల‌ను, సాంగ్స్ పాడిన వీడియో అభిమానుల‌తో పంచుకునే సితార‌.. ఓ యూట్యూబ్ ఛానెల్‌ను కూడా స్టార్ట్ చేసింది.

అలాగే 3డీ యానిమేషన్‌ వెబ్‌సిరీస్‌‌గా తెరకెక్కించిన ఫంటాస్టిక్‌ తారకు సితార‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా కూడా మారింది. ఇక తాజాగా ఈ చిన్నారి గిటార్ కూడా ప‌ట్టి.. త‌న‌లో ఉన్న కొత్త ట్యాలెంట్‌ను బ‌య‌ట పెట్టింది.

తాజాగా సితార నేర్చుకున్న గిటార్ విద్యను అభిమానుల‌తో పంచుకుంది. ప్ర‌స్తుతం సితార గిటార్ వాయిస్తున్న వీడియో నెట్టింట్లో తెగ‌ వైర‌ల్ అవుతోంది. దీంతో నెటిజ‌న్లు మ‌రియు మ‌హేష్ అభిమానులు సితార‌లో ఈ ట్యాలెంట్ కూడా ఉందా అంటూ ఆశ్చ‌ర్య‌పోతున్నారు.

సితార కొత్త‌ ట్యాలెంట్..ఆశ్చ‌ర్య‌పోతున్న మ‌హేష్ ఫ్యాన్స్‌!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts