కాబోయే భర్తకు రొమాంటిక్ బర్త్‌డే విషెస్ తెలిపిన మెహ్రీన్..!?‌

February 16, 2021 at 12:40 pm

త్వరలోనే టాలీవుడ్‌లో మరో అందాల భామ పెళ్లి పీట‌లెక్క‌బోతున్న సంగతి తెలిసిందే. కృష్ణ‌గాడి వీరప్రేమ గాథ‌తో తెలుగు పరిశ్రమకు ప‌రిచ‌యమైన మెహ్రీన్‌ త్వరలోనే పెళ్లి చేసుకోబోతుంది. హ‌ర్యానా మాజీ ముఖ్య‌మంత్రి భ‌జ‌న్ లాల్ బిష్ణోయ్ మ‌న‌వ‌డు భ‌వ్య బిష్ణోయ్‌ని వివాహం చేసుకోనుంది ఈ భామ. ఈ నేప‌థ్యంలో మార్చి 13న వీరి నిశ్చితార్థం రాజ‌స్థాన్‌లోని జోద్‌పూర్ విల్ల ప్యాలెస్‌లో జ‌ర‌గ‌నుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా షురూ అయినట్లు స‌మాచారం.

దీనిపై ఆమె అధికారిక ప్రకటన ఇంకా ఇవ్వనప్పటికీ వారి నిశ్చితార్థ ఆహ్వానానికి సంబంధించిన ఒక ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. భ‌వ్య పుట్టిన‌రోజు సంద‌ర్భంగా తాజాగా త‌న ఇన్‌స్టాలో ఓ పోస్ట్ పెట్టారు మెహ్రీన్‌. భవ్యతో తీసుకున్న పిక్ ని షేర్ చేసిన మెహ్రీన్ హ్యాపీ బర్త్ డే మై ఫ‌రెవ‌ర్ వ‌న్ అంటూ కామెంట్ కూడా పెట్టింది. ఇక ఆ పోస్ట్‌కి భ‌వ్య కూడా స్పందించి, దేవుడు పంపిన వ్య‌క్తికి థ్యాంక్యు అంటూ మెహ్రీన్ పోస్ట్‌కి భ‌వ్య రిప్లై ఇచ్చారు.

కాబోయే భర్తకు రొమాంటిక్ బర్త్‌డే విషెస్ తెలిపిన మెహ్రీన్..!?‌
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts