వైరల్: సిగ్నల్ కోసం మంత్రి ఏకంగా..?!

February 22, 2021 at 11:51 am

ప్రస్తుత రోజుల్లో ప్రతి చిన్న పిల్లవాడి నుంచి పెద్దవారి వరకు స్మార్ట్ ఫోన్ వినియోగం సర్వసాధారణం అయిపోయింది. దీనితో ఫోన్ లో సిగ్నల్ సరిగా లేకపోయినా ఇంటర్నెట్ సరిగ్గా రాకపోయినా ఎంతో అసహనానికి గురి అవుతూ ఉంటాం. సాధారణ ప్రజలకు ఇలాంటి సమస్యలు ఎదురైతే ఏదోలే అని అనుకుంటాము కానీ ఏకంగా ఒక మంత్రికి ఇలాంటి సమస్య ఎదురైతే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక మంత్రి సెల్ఫోన్ సిగ్నల్స్ సరిగ్గా లేకపోవడంతో ఏకంగా జైంట్ వీల్ ఎక్కి తాను కూర్చున్న క్యాబిన్ పై వరకు వెళ్లే వరకు అక్కడే ఫోన్ చేసుకున్నారు. ఈ సంఘటన ఎక్కడ జరిగింది అని అనుకుంటున్నారా..?! మధ్యప్రదేశ్ లోని అశోక్ నగర్ జిల్లాలో చోటు చేసుకుంది. ఈ విచిత్రమైన పరిస్థితి మధ్యప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ సహాయ మంత్రి బ్రజేంద్ర సింగ్ యాదవ్ కు జరిగింది.

ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్ లోని అశోక్ నగర్ జిల్లాలో ఆంకో  గ్రామంలో శ్రీరామ మహాయజ్ఞం, భగవత్ కథ అనే సాంస్కృతిక కార్యక్రమాలను చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా మంత్రి బ్రజేంద్ర సింగ్  ఆ ప్రాంతానికి హాజరుకాగా.. చుట్టూ కొండల మధ్య ఉండే ఆ ఊరులో ఉన్న ప్రజలు ఎదుర్కొనే సమస్యలు అన్నీ కూడా మంత్రితో పంచుకున్నారు. దీంతో వెంటనే మంత్రి స్పందిస్తూ.. సెల్ ఫోన్ తీసుకొని అధికారులతో మాట్లాడాలి అనుకొని ట్రై చేయగా సెల్ ఫోన్ లో సిగ్నల్  సరిగ్గా లేదు . దీనితో వెంటనే ఏం చేయాలో అర్థం కాక అక్కడే  ఊర్లో ఏర్పాటు చేసిన 50 అడుగుల ఎత్తయిన జైంట్ వీల్ కనపడటంతో వెంటనే మంత్రి జైంట్ వీల్ ఎక్కి పైకి వెళ్ళాక అధికారులకు ఫోన్ చేసి గ్రామస్తులు పడుతున్న సమస్యలన్నిటిని తెలియజేశారు. సంబంధించిన ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా చెక్కర్లు కొడుతుంది. ఈ సందర్భంగా మంత్రి  బ్రజేంద్ర సింగ్  స్పందిస్తూ.. “గ్రామంలో భగవత్ కథ, శ్రీరామ మహాయజ్ఞం కార్యక్రమాలు చేపడుతున్నామని, గ్రామస్తుల సమస్యలను అధికారులకు తెలిపే ప్రయత్నం లో సెల్ ఫోన్ సిగ్నల్స్ అందకపోవడంతో జైంట్ వీల్ ఎక్కి అధికారులకు తెలిపానని, అక్కడ నేను తొమ్మిది రోజులు ఉన్నారని ” బ్రజేంద్ర సింగ్ తెలియజేశారు.

వైరల్: సిగ్నల్ కోసం మంత్రి ఏకంగా..?!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts