ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ ఖరారు..!?

February 18, 2021 at 3:34 pm
Central-Election-Commission

ఆంధ్రప్రదేశ్ లో మరో ఎన్నికల నగరా మోగింది. ఏపీలో ఎమ్మెల్యే కోటాలోని ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేసింది. ఎమ్మెల్యే కోటాలో ఖాళీ అయిన 6 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలను నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 25న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. మార్చి 15న ఎన్నికలు జరుగుతాయి. నామినేషన్ల దాఖలుకు మార్చి 4న తుదిగడువు కాగా.. మార్చి 8 వరకు నామినేషన్లను ఉపసంహరించకోవచ్చు. మార్చి 15న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ జరుగుతుంది. అదే రోజు సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం అవుతుంది.

Central-Election-Commission

Central-Election-Commission

ఇక ఖాళీ అయిన స్థానాల విషయానికి వస్తే రాజ్యసభ ఎంపీగా వెళ్లడంతో మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ స్థానం ఖాళీ అయింది. అలాగే చల్లా రామకృష్ణారెడ్డి మృతి చెందడంతో ఆ స్థానం కూడా ఖాళీ అయింది. ఇక ప్రస్తుతం పదవుల్లో ఉన్న ఎమ్మెల్సీలు మహ్మద్ ఇక్బాల్, తిప్పేస్వామి, సుధారాణి, వీర వెంకన్న చౌదరిల పదవీ కాలం ఈ నెల 29తో ముగియనుంది. దీంతో మొత్తం 6 స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు నిర్వహిస్తున్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ ఖరారు..!?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts