అమితాబ్ కు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన మోహన్ లాల్…!?

February 23, 2021 at 7:57 pm
amithab

బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ అమితాబ్‌ బచ్చన్ గురించి తెలియని వారంటూ ఉండరు. ఆయన నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. ఇక అమితాబ్‌ బచ్చన్ ని ఆదర్శంగా తీసుకోని చాల మంది ఇండస్టీలోకి అడుగుపెట్టి స్టార్ హీరోలైయ్యారు. ఇక బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌కు మలయాళ స్టార్‌ హీరో మోహన్‌ లాల్‌ ఓ బహుమతిని పంపించారు. ఈ స్వయంగా బిగ్‌బీ ట్విటర్‌ వేదికగా ప్రకటించారు. కాగా ఇటీవల మోహన్‌ లాల్‌ కూతురు విస్మయ రాసిన ‘గ్రెయిన్స్‌ ఆఫ్‌ స్టార్‌డస్ట్‌’ పుస్తకం విడుదలైన సంగతి తెలిసిందే.

amithab

amithab

ఈ పుస్తకాన్ని మోహన్‌ లాల్‌ ఆయనకు పంపించారు. దీంతో బిగ్‌బీ ఆనందం వ్యక్తం చేస్తు ధన్యవాదాలు తెలిపారు. అలాగే ఆయన కూతురు విస్మయకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అమితాబ్‌ బచ్చన్‌ మంగళవారం ట్వీట్‌ చేస్తూ.. ‘మోహన్‌ లాల్‌, సూపర్‌ స్టార్‌ ఆఫ్‌ మలయాళం. నేను ఎంతో అభిమానించే వ్యక్తి. అయితే ఆయన కూతురు విస్మయ రాసిన ‘గ్రెయిన్స్ ఆఫ్‌ స్టార్‌డస్ట్‌’ బుక్‌ను ఆయన నాకు పంపించారు. ఊహాజనితంగా రాసిన ఈ పుస్తకంలో, సృజనాత్మకతతో కూడిన కవితలు, పెయింటింగ్‌తో నిండి ఉంది. పూర్తి కవిత్వంతో ఉన్న ఈ పుస్తకం చాలా బాగా నచ్చింది. అయినా ఈ ప్రతిభ వారసత్వంతోనే వస్తుంది. మై బెస్ట్‌ విషెస్‌ టూ విస్మయ’అంటూ ఆయన ట్వీట్‌ చేశారు.

ఇక బిగ్‌బీ ట్వీట్‌కు మెహన్‌ లాల్‌ స్పందిస్తూ.. ‘ఓ తండ్రిగా ఇది గర్వించే సమయం. ఓ లెజెండరి సూపర్‌ స్టార్‌ నుంచి నా కూతురు ప్రశంసలు అందుకుందంటే సాధారణ విషయం కాదు. ఇదంతా ఓ మాయలా ఉంది. థ్యాంక్యూ బచ్చన్‌ సార్‌’ అంటూ సమాధానం ఇచ్చారు. కాగా ఆయన కూతురు విస్మయ రాసిన ఈ పుస్తకాన్ని పెంగిన్వి ఇండియా సంస్థ ఆధ్వర్యంలో మోహన్‌ లాల్‌ ఫిబ్రవరి 14న విడుదల చేశారు.

అమితాబ్ కు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన మోహన్ లాల్…!?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts