‘మోసగాళ్లు’ ట్రైలర్..విష్ణు-కాజ‌ల్ పెద్ద స్కామ్‌కే పాల్ప‌డ్డారుగా!

February 25, 2021 at 5:32 pm

మంచు విష్ణు హీరోగా తెర‌కెక్కిన తాజా చిత్రం `మోస‌గాళ్లు`. జాఫ్రె చిన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో విష్ణు చెల్లెలి పాత్ర కాజ‌ల్ అగ‌ర్వాల్ న‌టిస్తుండ‌గా.. నవదీప్, నవీన్ చంద్ర, సునీత్ శెట్టి వంటి వారు కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఐటీ స్కామ్ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమా మార్చిలో విడుద‌ల కానుంది.

అయితే తాజాగా ఈ సినిమా ట్రైల‌ర్‌ను మెగాస్టార్ చిరంజీవి విడుద‌ల చేశారు. `డబ్బు సంతోషాన్ని ఇస్తుందనుకున్నా.. డబ్బు సెక్యూరిటీ ఇస్తుందనుకున్నా.. ఒట్టేసుకున్నా ఈ పేదరికం నుంచి దూరంగా వెళ్లిపోవాలని.. అంటూ మంచు విష్ణు చెప్పే డైలాగ్‌తో ప్రారంభ‌మైన ఈ సినిమా ట్రైల‌ర్ ఆధ్యంతం సూప‌ర్ థ్రిల్లింగ్‌గా కొన‌సాగింది.

తమ తెలివితో టెక్నాలజీని వాడుకుని అమెరికాలో రూ.2600 కోట్ల భారీ కుంభకోణానికి పాల్పడిన ఇండియన్స్ కథను ఇందులో చూపిస్తున్నట్లు ట్రైల‌ర్ బ‌ట్టీ అర్ధం అవుతోంది. ఇక మంచు విష్ణు మ‌రియు కాజ‌ల్ రోల్స్ ఆస‌క్తిక‌రంగా ఉన్నాయి. మొత్తానికి ఈ ట్రైల‌ర్ సినిమాపై భారీ అంచ‌నాలు పెంచేసింది. కాగా, ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు ఇంగ్లీష్, హిందీ,తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఏకకాలంలో నిర్మిస్తున్న విష‌యం తెలిసిందే.

 

‘మోసగాళ్లు’ ట్రైలర్..విష్ణు-కాజ‌ల్ పెద్ద స్కామ్‌కే పాల్ప‌డ్డారుగా!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts