రేటు పెంచేసిన టాలీవుడ్ యంగ్ హీరో..గుర్రుగా ద‌ర్శ‌కులు?

February 25, 2021 at 8:23 am

టాలీవుడ్ యంగ్ హీరో నాగ‌శౌర్య గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `ఊహలు గుసగుసలాడే` సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నాగ‌శౌర్య‌.. ఆ త‌ర్వాత వైవిద్య‌మైన క‌థ‌లు ఎంచుకుంటూ ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తున్నాడు. ఇక ఇటీవ‌ల అశ్వథ్థామ చిత్రంతో మంచి విజ‌యం అందుకున్న నాగ‌శౌర్య‌.. ప్ర‌స్తుతం `ల‌క్ష్య` సినిమాలో న‌టిస్తున్నాడు.

ఆర్చ‌రీ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతోన్న ఈ సినిమాకు సంతోష్ జాగర్లపూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఇక ఈ సినిమాతో పాటు నాగ‌శౌర్య `వ‌రుడు కావ‌లెను` సినిమాలోనూ న‌టిస్తున్నాడు. అనీష్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో రీతువ‌ర్మ హీరోయిన్‌. ఇదిలా ఉంటే.. వ‌రుస సినిమాల‌తో మంచు జోరు మీదున్న నాగ‌శౌర్య త‌న రెగ్యున‌రేష‌న్‌ను బాగా పేంచేశాడ‌ని ప్ర‌స్తుతం ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

నాగశౌర్య ఒక్క సినిమాల్లో నటించేందుకు రూ. రూ.4 కోట్లను తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. అందుకు తక్కువగా ఇస్తే సినిమాకు సైన్ చేసే ప్ర‌స‌క్తే లేద‌ని శౌర్య తేల్చి చెబుతున్నార‌ట‌. దీంతో కథ చెప్పడానికి వెళ్లిన దర్శకులు శౌర్య‌ డిమాండ్‌ చేస్తున్న రెమ్యూనరేషన్‌ విని ఒక్కసారిగా షాకవుతున్నార‌ట‌. ప్ర‌స్తుతం ఈ విష‌యంలోనే శౌర్య‌పై టాలీవుడ్ ద‌ర్శ‌క‌, నిర్మాత‌లు గుర్రుగా ఉన్న‌ట్టు టాక్. మ‌రి ఇందులో ఎంత వ‌ర‌కు నిజ‌ముందో తెలియాల్సి ఉంది.

రేటు పెంచేసిన టాలీవుడ్ యంగ్ హీరో..గుర్రుగా ద‌ర్శ‌కులు?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts