ఆ ఘోరా వేషంలో అదరగొడుతున్న బాలయ్య…!?

February 9, 2021 at 2:46 pm

తన కంటి చూపుతో చంపేస్తానని డైలాగ్స్ తో వార్నింగ్ ఇచ్చే బాలయ్య బాబు ఈసారి నిజంగా భయ పెట్టేందుకు వచ్చేస్తున్నాడు. తాజాగా ఆయన ఎన్న కనిపించని ఊహించలేని అవతారంలో కనిపించనున్నారు. ఆ మధ్య గుండు గెటప్‌ వేసుకున్న బాలయ్య ఈసారి ఏకంగా అఘోరా గెటప్ లో వచ్చేస్తున్నారు. మాస్‌ డైరెక్టర్‌ బోయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తున్న BB3 మూవీ చిత్రీకరణలో భాగంగా ఈ గెటప్‌ వేసినట్లు తెలుస్తుంది. పైగా ఈ వేషంలో బాలయ్య యాక్షన్‌ సన్నివేశాలు కూడా చేస్తున్నాడట. బాలయ్య ఎప్పుడు మిగతా హీరోలకు భిన్నంగా ఫ్లైట్లు చేస్తూ ఆయన ప్రత్యర్థులను అల్లల్లాడించడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. కాబట్టి ఈ ఫైటింగ్‌ సన్నివేశాలు కూడా చాలా అలవోకగా చేస్తున్నట్లు సమాచారం. ఏది ఏమయినా బాలయ్యను అలాంటి పాత్రలో చూసి ఆయన అభిమానులు థ్రిల్‌ ఫీలవ్వడం పక్కా . కాగా రూలర్ మూవీ‌తో ప్లాప్ అందుకున్న బాలకృష్ణ, వినయ విధేయ రామ మూవీతో దారుణ ఫ్లాఫ్‌ టాక్ ను అందుకున్న బోయపాటి శ్రీను ఈసారి సూపర్‌ హిట్‌ సాధించాలని కసితో ఈ మూవీ ‌ చేస్తున్నారు.

ఈ సినిమాని మే 28న విడుదల చేస్తామని మూవీ యూనిట్ ఇటీవలే ప్రకటించింది. కానీ ఇప్పటివరకు టైటిల్‌ మాత్రం ఇంకా వెల్లడించలేదు. ఫస్ట్‌ లుక్‌ మాత్రం విడుదల ‌ చేసింది. ఇందు‌లో మాత్రం బాలకృష్ణ యంగ్‌ అండ్‌ స్టైలిష్‌గా కనిపించాడు. ఇక ఈ మూవీలో హీరో రెండు వైవిధ్యమైన పాత్రలను పోషించనున్నట్లు టాక్. ప్రగ్యా జైశ్వాల్ ఓ హీరోయిన్ గా నటిస్తోంది. ద్వారకా క్రియేషన్స్‌ బ్యానర్‌పై జయ జానకి నాయక నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ సినిమాకి ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ సంగీతం సమకూరుస్తున్నాడు. గతంలో తమిళ హీరో ఆర్య నేను దేవుణ్ణి చిత్రంలో అఘోరాగా కనిపించాడు. ఈ సినిమా వచ్చి పదేళ్లు దాటిపోగా, ఈసారి నందమూరి నటసింహం బాలకృష్ణ అఘోరా పాత్రలో కనిపించనున్నారు. ఈ గెటప్‌లో బాలయ్య చెప్పే డైలాగ్స్‌, ఇంకా సన్నివేశాలు సినిమాకి పెద్ద హైలైట్‌ అవుతాయని మేకర్స్ అంటున్నారు. ఇక అఘోరాగా బాలయ్య‌ను చూడటం కోసం ఆయన అభిమానులు చాలా ఆసక్తిగా ఉన్నారు.

ఆ ఘోరా వేషంలో అదరగొడుతున్న బాలయ్య…!?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts