కేక పెట్టిస్తున్న `టక్ జగదీష్` టీజర్..నాని హీరోయిజం అదిరిపోయింది!

February 23, 2021 at 5:59 pm

న్యాచుర‌ల్ స్టార్ నాని ప్ర‌స్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో `ట‌క్ జ‌గ‌దీష్‌` ఒక‌టి. శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో రీతు వ‌ర్మ‌, ఐశ్వ‌ర్యా రాజేష్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఈ మూవీని షైన్ స్క్రీన్స్ బ్యాన‌ర్‌పై సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ది నిర్మిస్తున్నారు.

అయితే రేపు (ఫిబ్రవరి 24) నాని బ‌ర్త్‌డే కాగా.. ఒకరోజు ముందు ఈ సినిమా టీజర్ ను విడుద‌ల చేసింది చిత్ర యూనిట్‌. అందమైన పల్లెటూరిలో ఊరి పెద్ద నాజర్ కొడుకులుగా నాని, జగపతి బాబు కనిపించ‌బోతున్నారు. టీజర్ చూస్తుంటే పక్కా పల్లెటూరి బ్యాక్ డ్రాప్ లో వచ్చే కుటుంబ కథా చిత్రమని, అటు కమర్షియల్ విలువలకు లోటు ఉండదని స్ప‌ష్టంగా అర్థం అవుతోంది.

ఇక ఈ టీజ‌ర్‌లో నాని హీరోయిజం, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌, ఫైట్స్, ఎలాంటి డైలాగ్స్ లేకుండా టీజ‌ర్ మొత్తం సాగిన జానపద గీతం ఇలా ప్ర‌తి ఒక్క‌టి అంద‌రి చేత‌ కేక అనిపిస్తున్నాయి. మొత్తానికి తాజాగా విడుద‌లైన ఈ టీజ‌ర్ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకోవ‌డంతో పాటు సినిమాపై అంచ‌నాలు కూడా పెంచేశాయి.

కేక పెట్టిస్తున్న `టక్ జగదీష్` టీజర్..నాని హీరోయిజం అదిరిపోయింది!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts