“ఓ మంచి రోజు చూసి చెప్తా” విడుదల తేదీ ఖరారు..!

February 26, 2021 at 1:37 pm

ఈ మధ్య కాలంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో విలక్షణ నటుడు విజయ్ సేతుపతి పేరు బాగా వినిపిస్తుంది. తాజాగా ఆయన మెగా డాటర్ నిహారికతో కలిసి ఓ మంచి రోజు చూసి చెప్తా చిత్రంలో నటిస్తున్నారు. తమిళ చిత్రం ఓరు నల్ల నాల్ పాతు సోలరెన్ చిత్రాన్ని తెలుగులో ఓ మంచి రోజు చూసి చెప్తా అనే టైటిల్ తో దర్శకుడు ఆరుముగా కుమార్ రిలీజ్ చేస్తున్నారు. శ్రీమతి రావూరి అల్లికేశ్వరి సమర్పణలో అపోలో ప్రొడక్షన్స్ పతాకం పై డాక్టర్ రావూరి వెంకటస్వామి ఈమూవీ తెలుగు హాక్కులను భారి ధరకి దక్కించుకున్నారు.

ఈ చిత్రానికి ఓ మంచి రోజు చూసి చెప్తా అనే టైటిల్ తో మార్చ్ 19న రిలీజ్ చేస్తున్నారు. నిర్మాత డాక్టర్ రావూరి వెంకటస్వామి మాట్లాడుతూ ఓ మంచి రోజు చూసి చెప్తా సినిమా తమిళంలో మంచి హిట్ అయింది. యాక్టర్ విజయ్ సేతుపతి నటన ఈ చిత్రానికే పెద్ద హైలైట్ గా నిలుస్తోందన్నారు. నిహారిక కొణిదెల ఎన్నడూ కనిపించని పాత్రలో కనిపిస్తుందని, ఇది ఒక మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ తెలుగు ప్రేక్షకులకి పక్కాగా నచ్చుతుందని ఆయన అన్నారు.

“ఓ మంచి రోజు చూసి చెప్తా” విడుదల తేదీ ఖరారు..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts