
ప్రముఖ దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి తాజా సినిమా చెక్. ఈ చిత్రంలో నితిన్, ప్రియా వారియర్, రకుల్ ప్రీత్ సింగ్ హీరో, హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ భవ్య క్రియేషన్స్ బ్యానర్‌పై వీ ఆనంద ప్రసాద్ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవరిస్తున్నారు. ఫిబ్రవరి 26 తేదీన విడుదల అవ్వడంతో చెక్ మూవీ ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది.
ఈ క్రమంలో మూవీ యూనిట్ ఆదివారం నాడు ఫిబ్రవరి 21వ తేదీన ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను మాదాపూర్‌లోని ఎన్ కన్వెన్షన్‌లో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, మెగా హీరో వరుణ్ తేజ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ వేడుకలో మాట్లాడటానికి ముందు తొలి టికెట్‌ను రాజమౌళి, వరుణ్ తేజ్ కొనుగోలు చేశారు. బ్లాక్‌లో టికెట్ కొన్నామని రాజమౌళి ఈ వేడుకలో సెటైర్ కూడా వేశారు. ఫిబ్రవరి 26న రిలీజ్ అయ్యే చెక్ మూవీ కోసం ఎదురు చూస్తున్నాను అని రాజమౌళి అన్నారు.