ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమా..షూటింగ్‌కు ముహూర్తం ఖ‌రారు?

February 25, 2021 at 11:15 am

టాలీవుడ్ యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌స్తుతం రామ్ చ‌ర‌ణ్‌తో క‌లిసి `ఆర్ఆర్ఆర్‌` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రం షూటింగ్ చివ‌రి ద‌శ‌కు చేరుకుంది. ఇక ఈ సినిమా త‌ర్వాత ఎన్టీఆర్ మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్‌తో సినిమా చేయ‌నున్నాడు.

హారికా హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించ‌బోతున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించనున్నాడు. ఇదిలా ఉంటే.. ఇండ‌స్ట్రీ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం ఈ సినిమా షూటింగ్‌క మూహూర్తం ఖ‌రారు అయింద‌ట‌.

షూటింగును మే నెలాఖరులో ప్రారంభించి ఏకధాటిగా నిర్వహించేలా త్రివిక్ర‌మ్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. ఇప్ప‌టికే స్క్రిప్ట్ పూర్తి కాగా.. ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం ముమ్మరంగా జరుగుతున్నాయ‌ని తెలుస్తోంది. కాగా, .ఎన్టీఆర్ కేరీర్‌లో 30వ చిత్రంగా తెర‌కెక్కుతున్న‌ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ నటించబోతున్నారు.

ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమా..షూటింగ్‌కు ముహూర్తం ఖ‌రారు?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts