
అక్కినేని నాగార్జున తెలుగులోనే కాదు.. హిందీలో కూడా ఎన్నో సినిమాలు చేసి విజయం సాధించిన సంగతి తెలిసిందే. సౌత్ ఇండస్ట్రీ నుంచి బాలీవుడ్లో ఎక్కువ సినిమాల్లో యాక్ట్ చేసిన హీరోల్లో నాగార్జున ఒకరు. `శివ` సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగు పెట్టిన నాగ్.. ఖుదా గవా, ద్రోహి, క్రిమినల్, మిస్టర్ బేచారా, అంగారే ఇలా చాలా సినిమాలే చేశాడు.
అయితే ఆ తర్వాత ఉన్నట్టు ఉండి బాలీవుడ్‌కు దూరమైన నాగార్జున.. లాంగ్ గ్యాప్ తర్వాత మళ్లీ `బ్రహ్మాస్త్ర` చిత్రంతో రీ ఎంట్రీ ఇస్తున్నాడు. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రణబీర్ కపూర్, అమితాబ్ బచ్చన్, అలియా భట్, మౌని రాయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రంలో తన క్యారెక్టర్‌కు సంబంధించిన చిత్రీకరణను కూడా నాగ్ పూర్తి చేసుకున్నాడు.
అయితే నాగ్ మళ్లీ బాలీవుడ్లో రీ ఎంట్రీ ఇస్తుండడంతో ప్రస్తుతం ఆయనకు మరిన్ని ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయట. తాజా సమాచారం ప్రకారం..స్టార్ హీరో రణ్ వీర్ సింగ్ చేయబోతున్న ఓ మూవీలో నాగ్ కి కాస్త నెగిటివ్ షేడ్స్ ఉన్న ఓ రోల్ ఆఫర్ వచ్చిందట. నెగిటివ్ షేడ్స్ అయినప్పటికీ హీరోకి థీటుగా ఉండే క్యారెక్టరని తెలుస్తోంది. కానీ, నాగ్ ఈ సినిమాకు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చారా.. లేదా.. అన్నది మాత్రం తెలియలేదు. త్వరలోనే దీనిపై ఓ క్లారిటీ రానుంది.