`పైన పటారం..లోన లొటారం` అంటున్న అన‌సూయ‌..!

February 27, 2021 at 7:31 pm

టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ తాజా చిత్రం `చావు కబురు చల్లగా`. కౌశిక్ ద‌ర్శ‌త‌క్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో సొట్టబుగ్గల సుందరి లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా న‌టిస్తోంది. గీతా ఆర్ట్స్ అనుబంధ సంస్థ జీఏ2 పిక్చర్స్ బ్యానర్ మీద బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో బుల్లితెర హాట్ యాంక‌ర్ అన‌సూయ ఓ స్పెష‌ల్ సాంగ్ చేసింద‌న్న విష‌యం తెలిసిందే.

అయితే తాజాగా ఆ స్పెష‌ల్ సాంగ్ ప్రోమోను విడుద‌ల చేసింది చిత్ర యూనిట్‌. `పైనపటారం..ఈడ లోన లొటారం..విను బాసు చెబతాను లోకం వయ్యారం..` అంటూ సాగుతున్న ఈ సాంగ్‌లో అనసూయ ఫుల్‌ అవుడ్ అండ్ అవుట్ మాస్ స్టెప్పులతో అదరగొట్టింది.

ప్ర‌స్తుతం ఈ సాంగ్ ప్రోమో ప్రేక్ష‌కుల‌ను తెగ ఆక‌ట్టుకుంటోంది. ఇక ఫుల్ సాంగ్‌ను మార్చి 1వ తేదీని విడుద‌ల చేయ‌నున్న‌ట్టు కూడా ఈ ప్రోమోలో తెలిపారు. దీంతో ఫుల్ సాంగ్ కోసం ప్రేక్ష‌కుల ఉత్సాహ‌ప‌డుతున్నారు.

`పైన పటారం..లోన లొటారం` అంటున్న అన‌సూయ‌..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts