
పాకిస్థాన్ దేశానికి చెందిన ఓ ఎంపీ 14 ఏళ్ల మైనర్ బాలికను పెళ్లి చేసుకున్న ఘటన దేశంలోని బలోచిస్థాన్‌లో సంచలనం రేపింది. బలోచిస్థాన్ జాతీయజమైతేఉలేమా ఇ ఇస్లాం నేత, పాకిస్తాన్ ఎంపీ మౌలానా సలాఉద్దీన్ అయూబి 14 ఏండ్ల బలూచిస్తాన్ బాలికను పెండ్లి చేసుకున్నాడని ఆరోపణలు వెల్లువెత్తాయి. మైనర్ బాలికతో ఎంపీ వివాహంపై పాకిస్తాన్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
చిత్రాల్లో మహిళా సంక్షేమ రంగంలో పనిచేస్తున్న ఓ స్వచ్ఛంద సంస్థ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పాకిస్తాన్ చట్టాల ప్రకారం 16 ఏండ్లలోపు బాలికలతో వివాహాలను అనుమతించారు. బలూచిస్తాన్ ఎంపీ తన కంటే నాలుగు రెట్లు చిన్న వయసు కలిగిన బాలికను వివాహం చేసుకున్నారనే వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారిందని స్వచ్ఛంద సంస్థ దావతోఅజీమట్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బాలిక జుగూర్లోని ప్రభుత్వ బాలికల పాఠశాలలో చదువుతోందని, రికార్డుల ప్రకారం బాలిక 2006 అక్టోబర్ 28న జన్మించినట్టు తెలిసిందని డాన్ పత్రిక పేర్కొంది. ఎంపీతో వివాహంపై ఫిర్యాదు ఆధారంగా బాలిక గృహాన్ని ఇటీవల పోలీసులు సందర్శించగా తమ కుమార్తెకు పెండ్లి కాలేదని ఆమె తండ్రి వెల్లడించారని తెలిపింది. మరోవైపు బాలికతో ఎంపీ నిఖాను పక్కా చేసుకున్నారని, వివాహ వేడుక ఇంకా జరగలేదని పాక్ అబ్జర్వర్ పేర్కొంది.
కొన్ని రోజుల క్రితం సంస్థ ఫిర్యాదు మేరకు పోలీసులు బాలిక ఇంటికి చేరుకున్నారని, అయితే ఆమె తండ్రి బాలిక వివాహాన్ని ఖండించారని, ఈ మేరకు అఫిడవిట్ కూడా ఇచ్చారని చిత్రాల్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ ఇన్స్పెక్టర్ సజ్జాద్ అహ్మద్ పేర్కొన్నారు. వారు అసలు తమ అమ్మాయికి వివాహమే జరిపించలేదని అఫిడవిట్ ను ఇచ్చినట్టు పోలీసు అధికారులు వెల్లడించారు. ఇదిలావుండగా, తన కుమార్తెకు 16 సంవత్సరాలు వచ్చే వరకు పంపవద్దని బాలిక తండ్రి అధికారులకు హామీ ఇచ్చారని లోయర్ చిత్రాల్ డిపిఓ తెలిపింది