పవన్ సినిమాకు ఊహించ‌ని షాక్‌..ఆగ్ర‌హంలో క్రిష్‌!

February 26, 2021 at 8:19 am

ప‌వర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌స్తుతం క్రిష్ జాగర్లమూడి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఏ ఎం రత్నం నిర్మాత వ్యవహరిస్తున్న ఈ సినిమా పీరియాడిక్ మూవీగా తెర‌కెక్కుతోంది. ఈ చిత్రంలో పవన్ సరసన ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్, బాలీవుడ్ బ్యూటీ జాక్వలైన్‌ ఫెర్నాండెజ్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ఈ చిత్రానికి `హరిహర వీరమల్లు` అనే టైటిల్ ప‌రిశీల‌న‌లో ఉంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు లీకుల వీరులు ఊహించ‌ని షాక్ ఇచ్చారు. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతుండ‌గా.. షూటింగ్ స్పాట్ నుంచి పవన్ పిక్స్ లీక్ అయ్యాయి. ఈ ఫొటోలో పవన్ పీరియాడికల్ లుక్ లో కనిపిస్తున్నాడు.

ప్ర‌స్తుతం ఈ ఫొటోలు నెట్టింట్లో తెగ వైర‌ల్ అవుతున్నాయి. అయితే ఫ‌స్ట్ లుక్ విడుద‌ల కాక‌ముందే.. ప‌వ‌న్ లుక్స్ బ‌య‌ట‌కు రావ‌డంతో క్రిష్ యూనిట్‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నార‌ట‌. ఇక‌పై షూటింగ్ స్పాట్స్ నుంచి ఎలాంటి ఫొటోలు, వీడియోలు లీక్ కాకుండా మ‌రిన్ని జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని సూచించార‌ట‌.

Fastest Pawan-Krish Movie Shooting ... Pawan Look Leaked From Spot..Viral  On Social Media - Power Star Photo Leak From Krish Movie Set »  Entertainment » Prime Time Zone

పవన్ సినిమాకు ఊహించ‌ని షాక్‌..ఆగ్ర‌హంలో క్రిష్‌!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts