అమెజాన్ ప్రైమ్ లో పవన్ వకిల్ సాబ్ సినిమా…!?

February 28, 2021 at 3:41 pm

ప్రస్తుతం టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా శ్రీరామ్ వేణు దర్శకత్వంలో తెరకెక్కించిన తాజాసినిమా వకీల్ సాబ్. ఈ చిత్రం బాలీవుడ్ బ్లాక్ బస్టర్ పింక్ చిత్రానికి రీమేక్‌గా వస్తోంది. ఏప్రిల్ 9న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ అవుతోంది. భారీ అంచనాల మధ్య వస్తోన్న ఈ చిత్రం ఆ మధ్య డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదల కానుందని వార్తలు వచ్చాయి. ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రానికి ఓటీటీ డీల్ కుదిరిందని టాక్. అమెజాన్ ప్రైమ్ వకీల్ సాబ్ స్ట్రీమింగ్ హక్కులను భారీ మొత్తానికి కొనుగోలు చేసి అమెజాన్ ప్రైమ్ దక్కించుకుంది అని సమాచారం. ఇక ఈ సినిమా శాటిలైట్ హక్కులు కూడా అమ్ముడు అయిపోయాయి. వకీల్ సాబ్ శాటిలైట్ రైట్స్‌ను జీ తెలుగు కొనుగోలు చేసింది. కానీ ఇక్కడ కండీషన్ ఏమంటే, వకీల్ సాబ్ మూవీని థియేటర్‌లో 50 రోజులు పూర్తి అయ్యే వరకు అమెజాన్‌లో స్ట్రీమింగ్ చెయ్యకూడదని ఒప్పందం కుదుర్చుకున్నారట. ఇక ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తుండగా నివేతా థామస్, అంజలి, అనన్య నాగల్ల కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ఇకపోతే పవన్ కళ్యాణ్ ఇతర మూవీస్ విషయానికి వస్తే, ఆయన క్రిష్ జాగర్లమూడి మూవీలో నటిస్తున్నాడు. చారిత్రక నేపథ్యం లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో పవన్ కళ్యాన్ వ‌జ్రాల దొంగగా క‌నిపించ‌నున్నాడ‌ని టాక్. ఈ సినిమా పవన్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో రూపొందుతుంది. ఈ చిత్రానికి ఏ ఎం రత్నం నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఈ చిత్రానికి టైటిల్ గా హరిహర వీరమల్లుగా అనుకుంటున్నట్లు వినికిడి. ఈ చిత్రానికి గతంలో విరూపాక్ష, హరహర మహాదేవ వంటి మూవీ టైటిల్స్ ని అనుకున్నట్లు ప్రచారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. వచ్చే సంవత్సరం 2022 సంక్రాంతికి పండుగ కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

అమెజాన్ ప్రైమ్ లో పవన్ వకిల్ సాబ్ సినిమా…!?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts