
సుకుమార్ తెరకెక్కించిన 100%లవ్, వన్ నేనొక్కడినే చిత్రాలకు స్క్రీన్ ప్లే అందించిన హరిప్రసాద్ జక్కా దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం `ప్లే బ్యాక్`. దినేష్ తేజ్, అనన్యా నాగళ్ల జంటగా నటించిన ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ క్రియేషన్స్ పథాకంపై ప్రసాద్ రావు పెద్దినేని నిర్మించారు.
మార్చి 05 న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. అయితే సినిమా విడుదల తేది దగ్గర పడుతుండడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ప్రారంభించింది. ఇందులో భాగంగానే తాజాగా ప్లే బ్యాక్ ట్రైలర్ విడుదల చేసింది.
దేశంలోనే తొలిసారి క్రాస్ టైమ్ కనెక్షన్ నేపథ్యంలో రాబోతున్న చిత్రమిది. తాజాగా విడుదలైన ట్రైలర్ ఆధ్యంతం సూపర్ ఇంట్రస్టింగ్‌గా కొనసాగడంతో పాటు.. సినిమా భారీ అంచనాలు పెంచేసింది. సరకొత్త పాయింట్‌తో ఈ చిత్రం రాబోతోందని ట్రైలర్ బట్టీ క్లారిటీగా అర్థం అవుతోంది. మరి ఆ ట్రైలర్‌పై మీరు ఓ లుక్కేసేయండి.