ప్రభాస్ ‘సలార్’ విడుదల తేదీ ఖరారు..!

February 28, 2021 at 4:26 pm

టాలీవుడ్ ప్రముఖ రెబెల్ స్టార్ హీరో ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం సలార్ 2022 ఏప్రిల్ 14న రిలీజ్ కానుంది. దీనికి సంబంధించిన ప్రకటన మూవీ బృందం ఈరోజు చేసింది. కేజీఎఫ్ ఫేమ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న సలార్ మూవీ ప్రస్తుతం రామగుండం వద్ద బొగ్గు గనుల్లో షూటింగ్ జరుపుకుంటోంది. పలు భాషల్లో తెరకెక్కుతున్న ఈ మూవీలో హీరో ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది.

హోంబలే ఫిలింస్ బ్యానర్ పై విజయ్ కిరంగదూర్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. బొగ్గు గనుల్లో పనిచేసే యువకుడి పోరాటమే సలార్ మూవీ కథాంశం అని సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. బాహుబలి తర్వాత ప్రభాస్ కు ఆలిండియా లెవల్లో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోవడం, కేజీఎఫ్ చిత్రాలతో ప్రశాంత్ నీల్ భారీ సినిమాల దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకోవడంతో వీళ్లిద్దరి కాంబోలో వస్తున్న సలార్ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ప్రభాస్ ‘సలార్’ విడుదల తేదీ ఖరారు..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts