
ఒరు ఆదార్ లవ్ అనే చిత్రంలో ఒక పాటలో కన్ను గీటుతో కోట్లాది మంది మనసులు గెలుచుకున్న బ్యూటీ ప్రియా ప్రకాశ్ వారియర్. చూడ చక్కని అందంతో పాటు అభినయంతో ఆకట్టుకునే ఈ అందాల భామ చెక్ అనే చిత్రంతో తెలుగులోకి డెబ్యూ ఇచ్చింది. ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు రానుండగా, ప్రియా ప్రకాశ్ పర్ఫార్మెన్స్ కోసం అయినా సరే థియేటర్ కు వెళ్లి మూవీ చూడాలని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.
చెక్ సినిమాలో నితిన్‌తో కలిసి ప్రియా చేసిన హల్చల్ మాములుగా లేదు. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ చాలా బాగుంది. తెలుగులో పలు ప్రాజెక్ట్స్‌కు ప్రియా ప్రకాష్ ఓకే చెప్పినట్లు తెలుస్తుండగా, అల్లు అర్జున్ చిత్రాన్ని ఆమె రిజెక్ట్ చేసిందని సమాచారం. దీని పై స్పందించిన ప్రియాంక ప్రకాశ్, అల్లు అర్జున్ డబ్బింగ్ మూవీస్ మలయాళంలో రిలీజ్ కాగా, అవి చిన్న వయసు నుండి నేను చూస్తూ వచ్చాను. ఆయనపై నాకు ప్రత్యేక అభిమానం ఉంది. నాకు అల్లు అర్జున్ తో సినిమా ఆఫర్ వచ్చిందని, దానిని నేను రిజెక్ట్ చేసానని వస్తున్న వార్తలలో ఏమాత్రం నిజం లేదు అని ప్రియా స్పష్టం చేసింది.