వెరైటీ డ్రెస్‌లో ప్రియాంక నెట్టింట్లో ఫుల్ హల్చల్..!!

February 25, 2021 at 1:26 pm

బాలీవుడ్ ప్రముఖ న‌టి, మాజీ విశ్వ సుంద‌రి ప్రియాంక చోప్రా స్టైల్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పే పని లేదు. అవార్డ్ వేడుకలకి ప్రియాంక స్టైలిష్ డ్రెస్‌ల‌లో రెడ్ కార్పెట్‌ పై న‌డుస్తుంటే చూసే వారికి రెండు క‌ళ్లు చాలవు. గ్లోబ‌ల్ భామ‌గా మారిన త‌ర్వాత ప్రియాంక డ్రెస్సింగ్ స్టైల్ ఇంకా మారిపోయింది. వరల్డ్ వైడ్ బెస్ట్ ఫ్యాషన్ ట్రెండ్ ను ఫాలో అవుతూ అందరిని బాగా ఆక‌ట్టుకుంటుంది. తాజాగా ఊహించ‌ని డ్రెస్సుల‌లో క‌నిపించి అంద‌రికి పెద్ద ఝలక్ ఇచ్చింది.

గోళాకారం లాంటి డ్రెస్ ధ‌రించి ప్రియాంక చోప్రా ఆ డ్రెస్‌లో కొన్ని పిక్స్ దిగింది. ఆ ఫొటోస్ ని సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌డంతో కొద్ది నిమిషాల‌లో అవి బాగా వైర‌ల్ అయ్యాయి. నెటిజ‌న్స్ అయితే ఆటో హారన్ నుంచి పోకి మాన్ వరకు అన్ని రకాల మీమ్స్ తో హల్చల్ చేశారు. చివ‌ర‌కి భార‌త కెప్టెన్ విరాట్ కోహ్లీ ను కూడా ఇందులో ఇన్వాల్వ్ చేస్తూ, బంతిలా ఉన్న ప్రియాంక చోప్రాను విరాట్ కోహ్లీ క్యాచ్ ప‌డుతున్న‌ట్టు మీమ్ ఒక్కటి త‌యారు చేసి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడు ప్రియాంక వెరైటీ డ్రెస్ ఎంత వైరల్ అయిందో, ఆమె పై వచ్చిన మీమ్స్ కూడా అదే విధంగా హాట్ టాపిక్ అయ్యాయి. వెరైటీ డ్రెస్‌లో ప్రియాంక చోప్రా, సోష‌ల్ మీడియాలో మీమ్స్‌తో ఫుల్ రచ్చ. ‌అయితే త‌న‌ పై క్రియేట్ చేసిన మీమ్స్‌ పై ప్రియాంక పాజిటివ్‌గా స్పందించడం కొస‌ మెరుపు అని చెప్పచు. కాగా, అన్ ఫినిషిడ్‌ పేరుతో ప్రియాంక చోప్రా ఆత్మకథ రాయ‌గా, ఇది వివాదాల‌కు కేంద్ర బిందువుగా మారిన విషయం అందరికి తెలిసిందే.

వెరైటీ డ్రెస్‌లో ప్రియాంక నెట్టింట్లో ఫుల్ హల్చల్..!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts