ఆకాశ నిగింలోకి దూసుకెళ్లిన పీఎస్ఎల్వీ సీ-51…!?

February 28, 2021 at 3:54 pm
Pslv

భారతదేశ కీర్తి ప్రతిష్ఠలను ప్రపంచస్థాయిలో ఇనుమడింపజేసిన ఇస్రో మరో చరిత్రాత్మక విజయాన్ని అందుకుంది. శ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని షార్‌ కేంద్రంలో ఉన్న ప్రథమ ప్రయోగ వేదిక నుంచి పీఎ్‌సఎల్వీ-సీ51ని ప్రయోగించేందుకు శాస్త్రవేత్తలు ఏర్పాట్లు పూర్తిచేశారు. భారత అంతరిక్ష సంస్థ ఇస్రో చేపట్టిన పీఎస్‌ఎల్‌వీ-సీ51 రాకెట్‌ విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. అమెజానియా-1తో పాటు 18 ప్రైవేటు ఉపగ్రహాలను నింగిలోకి తీసుకెళుతోంది. 50 ఏళ్ల చరిత్రలో తొలిసారిగా విదేశీ ప్రైవేటు సంస్థల ఉపగ్రహాలను భారత్‌ అంతరిక్షంలోకి ప్రవేశపెట్టింది.

Pslv

Pslv

ఈ ప్రయోగం నాలుగు దశలు విజయవంతమయ్యాయి. అమెజానియా అమెజానియా-1తో పాటు 18 ప్రైవేటు ఉపగ్రహాలు అంతరిక్ష్య కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశించాయి. ప్రయోగ ప్రత్యక్ష ప్రసారాన్ని ఆదివారం ఉదయం 9.50 నుంచి దూరదర్శన్‌, ఇస్రో వెబ్‌సైట్‌లలో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. అయితే ప్రయోగానంతరం పీఎ్‌సఎల్వీ-సీ51 రాకెట్‌ 1.55 గంటలపాటు రోదసిలో పయనించనుంది. బయలుదేరిన 17.23 నిమిషాలకు బ్రెజిల్‌కు చెందిన 637 కిలోల అమెజోనియ-1 ఉపగ్రహాన్ని సూర్యానువర్తన ధృవకక్ష్యలోకి చేరవేయనుంది. అనంతరం నాలుగు నిమిషాలలో మిగిలిన 18 బుల్లి ఉపగ్రహాలను కక్ష్యల్లో వదిలిపెట్టనుంది.

ఇస్రో చైర్మన్‌ శివన్‌, శాస్త్రవేత్తలు శనివారం పీఎ్‌సఎల్వీ-సీ51 నమూనాతో తిరుపతి వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. ప్రయోగం విజయవంతమవడం పట్ల ఇస్రో ఛైర్మన్‌ శివన్‌ సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన శాస్త్రవేత్తలను అభినందించారు. ప్రైవేటు సంస్థల భాగస్వామ్యంతో ఇస్రో చేసిన తొలి అంతరిక్ష ప్రయోగం ఇదే కావడం విశేషం.

ఇదిలా ఉంటే.. పీఎస్‌ఎల్వీ సీ-51 ద్వారా..భగవద్గీతతో పాటు ప్రధాని మోదీ ఫొటోను నింగోలోకి పంపారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఈ సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది ఇస్రో. ఈ పీఎస్‌ఎల్వీ సీ-51 రాకెట్‌ ద్వారా.. ఓ ఈ అరుదైన ఘట్టానికి తెరలేపింది చెన్నైకు చెందిన స్పేస్‌ కిడ్జ్స్‌ అనే ఇండియా సంస్థ. మొట్టమొదటిసారిగా తాము చేస్తున్న ఈ ప్రయోగంలో .. ప్రధాని మోదీ ఫొటో కింద..ఆత్మనిర్భర్‌ మిషన్‌ అనే పదాలతో పాటు భగవద్గీతను పంపించారు. అంతేకాదు. మరో 25వేల మంది పేర్లను కూడా పంపించారు. ఆ 25వేల మందిలో వెయ్యి మంది విదేశీయులు కాగా.. చెన్నైలోని ఓ పాఠశాలకు చెందిన విద్యార్థుల పేర్లున్నాయి.

ఆకాశ నిగింలోకి దూసుకెళ్లిన పీఎస్ఎల్వీ సీ-51…!?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts