ఈఫిల్​టవర్ కంటే ఎత్తులో నిర్మాణం.. ఆసక్తి రేపుతున్న రైల్వే మంత్రి ప్రకటన..!!

February 27, 2021 at 3:15 pm

జమ్మూ కశ్మీర్‌లో ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన రైల్వే బ్రిడ్జి నిర్మాణం జరుగుతున్న సంగతి అందరికి తెలిసిందే. మూడేళ్ల క్రితం ఈ బిడ్జి నిర్మాణ పనులు మొదలు కాగా, ప్రస్తుతం దీని ఆర్చ్​ దాదాపు పూర్తి కావ్వొస్తుంది..ఈ విషయాన్ని రైల్వే శాఖ మంత్రి పీయూష్​ గోయల్​ తన ట్విట్టర్​ ద్వారా వెల్లడించారు. భూతల స్వర్గంగా షాజహాన్​ జమ్మూ కశ్మీర్​ను వర్ణించాడు.ఇక్కడి ఎత్తైన పర్వతాలు, నదులు, లోయలు భారత కిరీటంలో కలికితురాళ్లుగా చెప్పవచ్చు. ఇప్పుడు ఇది మరో ఇంజినీరింగ్ అద్భుతానికి నిదర్శనం కానుంది. కశ్మీర్​లో మరో అద్భుత కట్టడం సిద్ధమవుతోంది. దీనికి సంబంధించిన ఫొటోలను రైల్వే శాఖ మంత్రి పోస్ట్ చేస్తూ మరో ఇంజినీరింగ్​ అద్భుతాన్ని అందుకునే దిశగా భారతీయ రైల్వే అడుగులు వేస్తోంది. చీనాబ్ నది పై నిర్మిస్తోన్న ఈ స్టీల్ ఆర్చ్ మరి కొద్ది రోజుల్లోనే పూర్తి కానుంది అంటూ ట్వీట్ చేశారు.

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ఈ రైల్వే బ్రిడ్జిని జమ్మూ కశ్మీర్​లోని రియాసీ జిల్లాలో చీనాబ్​ నది పై నిర్మిస్తున్నారు. 2017 నవంబర్​లో దీని నిర్మాణం ప్రారంభమైంది. చీనాబ్​ నదికి 359 మీటర్ల ఎత్తులో చేపట్టిన ఈ నిర్మాణానికి మొత్తం రూ.1250 కోట్ల ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. ఈ రైల్వే బ్రిడ్జిని 8 మ్యాగ్నిట్యూడ్​ తీవ్రతతో వచ్చే భూకంపాలను కూడా తట్టుకునే విధంగా వారు ఈ బ్రిడ్జి ని నిర్మిస్తున్నారు. ఈ రైల్వే బ్రిడ్జ్​ను 1.315 కిలోమీటర్ల పొడవు, 359 మీటర్ల ఎత్తుతో స్టీల్ సహాయంతో వంపుగా నిర్మిస్తున్నారు. ఇది దేశంలోనే మొట్ట మొదటి కేబుల్-స్టే ఇండియన్ రైల్వే బ్రిడ్జ్ కావడం విశేషం. ఈ కేబుల్​ బ్రిడ్జ్​ జమ్మూ & కశ్మీర్‌లోని ఉధంపూర్​– -శ్రీనగర్– -బారాముల్లా ప్రాంతాల మధ్య రైల్ లింక్​ను ఏర్పరుస్తుంది. ఈ ప్రాజెక్టును కొంకణ్ రైల్వే హెల్మ్ చేపట్టారు. ఈ ప్రాజెక్టు పై కొంకణ్ రైల్వే చైర్మన్ సంజయ్ గుప్తా మాట్లాడుతూ, మిగతా భారత్‌తో కశ్మీర్​ను కలుపడానికి మూడేళ్ల క్రితమే ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెన పనులను చేపట్టాం. 2021 డిసెంబర్ నాటికి ఈ బ్రిడ్జ్​ పనులు పూర్తి అవుతాయి. ఇది ప్రపంచంలోనే ఎత్తైన ఈఫిల్​ టవర్​ కంటే 30 మీటర్లు ఎత్తైనది అని ఆయన తెలిపారు.

ఈఫిల్​టవర్ కంటే ఎత్తులో నిర్మాణం.. ఆసక్తి రేపుతున్న రైల్వే మంత్రి ప్రకటన..!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts