బంగారాన్ని తలదన్నేలా పసుపు..ధర చుస్తే షాక్..!?

February 26, 2021 at 1:17 pm

పసుపు ధ‌ర పసిడి ధ‌ర‌తో పోటి ప‌డుతోంది. గ‌త ప‌దేళ్ల‌లో ఎన్న‌డు లేని విధంగా రాజ్‌పురి రకం ప‌సుపు క్వింటాలుకు రూ.21వేలు అయింది. ఇదే ప‌సుపు పంట‌కు ఆల్ టైం రికార్డు ధ‌ర‌. మ‌హారాష్ట్రలోని సాంగ్లీ మార్కెట్‌లో రాజ్ పురి ర‌కం ప‌సుపు రూ. 21వేలు పలకడంతో, సాధారణ రకాలకు క్రమంగా గిరాకీ ఇంకా రేటు పెరుగుతోంది. పసుపు పంటకు మార్కెట్లో మంచి రేటు పెరుగుతుండడంతో రైతుల్లో సంతోషం వ్యక్తం అవుతోంది. గ‌త రెండు రోజుల క్రితం కర్ణాటకకు చెందిన ఒక రైతు 6 సంచుల రాజ్ పూర్ ర‌కం ప‌సుపును సాంగ్లీ మార్కెట్‌కు తీసుకువెళ్లారు. వ్యాపారులు ఈ ర‌కం ప‌సుపు పై చాలా ఆస‌క్తి చూప‌డంతో అత్య‌దిక ధ‌ర రూ.21వేలకు క్వింటాలు అమ్ముడు పోయింది. రాజ్‌పురి ర‌కంలో కుర్కుమెన్ శాతం అధికంగా ఉండడంతో వ్యాపారులు ఎక్కువ ధర పెట్టారని మార్కెట్ వాళ్ళు చెప్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో గ‌తంలో రాజ్‌పురి రకం పండించే వారు.

ఈ రకం పసుపు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో ఎక్కువగా సాగుచేస్తారు. నిజామాబాద్, జగిత్యాల్, నిర్మల్ జిల్లాల్లో ఎర్ర గుంటూరు, ఏసీబీ 79, ఆర్మూర్ రకం ప‌సుపు పంట‌ల‌ను సాగు చేస్తున్నారు. 2009-10, 2010-11లో అత్యధికంగా క్వింటాలుకు 16వేల ధర పలకడం తో రైతులు భారీగా లాభాలను చూసారు. కానీ 2012 నుంచి ధరలు భారీగా పది పోయాయి. నిజామాబాద్ మార్కెట్‌లో గ‌త ప‌దేళ్ల‌లో ఎన్న‌డు లేని విదంగా గ‌రిష్టంగా క్వింటాల‌కు 8వేల రూపాయ‌ల ప‌లుకింది. అటూ మ‌హారాష్ట్ర‌లోని సాంగ్లీ మార్కెట్ లో ఏడు వేల నుండి 12 వేల వరకు ధర పలికింది.. మొత్తం మీద ఈ యేడు ప‌సుపు ధర రైతుల‌కు లాభ సాటిగా ఉంది. ప‌సుపు ధ‌ర‌లు రోజు రోజుకు పెరుగుతుండ‌డంతో రైతులు చాలా సంతోష పడుతున్నారు. రాజ్‌పురి రకం పసుపులో ఎన్నో ఔష‌ద గుణాలు కూడా ఉన్నాయి. ఇందులో కుర్కుమెన్ శాతం ఎక్కువగా ఉండ‌డంతో మెడిసిన్ త‌యారిలో, బ్యుటీ క్రీముల్లో ఎక్కువగా వాడుతారు. మ‌రోవైపు ప్ర‌ముఖ‌ దేవాల‌యల్లో పూజా కార్యక్రమాలకు కూడా ఇదే ఉప‌యోగిస్తారు. అందుకే రాజ్ పురి ర‌కం ప‌సుపు పంట‌కు మంచి ధ‌ర లభిస్తుంది. బంగారం ధరతో ఈ రకం పసుపు పోటీ పడుతోంది.

బంగారాన్ని తలదన్నేలా పసుపు..ధర చుస్తే షాక్..!?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts