విజ‌య్ దేవ‌ర‌కొండతో శివ‌గామి సంద‌డి..నెట్టింట్లో ఫొటోలు వైరల్‌!

February 23, 2021 at 12:48 pm

టాలీవుడ్ రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ ప్ర‌స్తుతం డాషింగ్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో `లైగ‌ర్` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషాల్లో రూపొందుతున్న ఈ సినిమాను సెప్టెంబర్‌ 9న విడుద‌ల చేయ‌నున్నారు.

పాన్ ఇండియా కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో శివ‌గామి అదేనండీ ర‌మ్య‌‌కృష్ణ న‌టుస్తున్న సంగ‌తి తెలిసిందే. విజ‌య్‌కు త‌ల్లిగా ర‌మ్య‌‌కృష్ణ క‌నిపించ‌నుంది. అయితే తాజాగా ర‌మ్య‌కృష్ణ లైగ‌ర్ షూటింగ్‌లో పాల్గొని.. విజ‌య్ దేర‌కొండ‌తో సంద‌డి చేసింది.

అంతేకాదు, అందుకు సంబంధించిన ఫొటోల‌ను కూడా సోష‌ల్ మీడియా వేదిక‌గా ర‌మ్య‌కృష్ణ అభిమానుల‌తో పంచుకోవ‌డంతో.. అవి వైర‌ల్‌గా మారాయి. ఇక ఈ ఫొటోల్లో ర‌మ్యకృష్ణ లుక్ చాలా డిఫ‌రెంట్ ఉంది. కాగా, ఛార్మీ, కరణ్ జోహార్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఆ చిత్రంలో విజ‌య్ బాక్స‌ర్‌గా క‌నిపించ‌నున్నాడు.

విజ‌య్ దేవ‌ర‌కొండతో శివ‌గామి సంద‌డి..నెట్టింట్లో ఫొటోలు వైరల్‌!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts