ముంబైలో కాస్టలీ ప్లాట్ కొన్న ర‌ష్మిక..!!‌

February 24, 2021 at 3:19 pm

ఇటు తెలుగు అటు మ‌ల‌యాళ భాష‌ల్లో టాప్ లీడింగ్ హీరోయిన్ గా కొన‌సాగుతుంది రష్మిక మంద‌న్నా. తెలుగులో స్టార్ హీరోల‌తో న‌టిస్తూ చాలా మంది ఫాలోవ‌ర్ల‌ను సంపాదించుకుంది రష్మిక. తాజాగా న‌టుడు సిద్దార్థ్ మ‌ల్హోత్రాతో క‌లిసి మిష‌న్ మ‌జ్ను సినిమాతో బాలీవుడ్ లోకి ప్రవేశిస్తుంది ఈ లక్కీ బ్యూటీ. హిందీ చిత్ర‌ప‌రిశ్ర‌మ‌ పై ఫోక‌స్ పెట్టాల‌నుకుంటున్న ర‌ష్మిక ఈ చిత్రం కోసం స్పెష‌ల్‌గా ట్యూట‌ర్ ను కూడా పెట్టుకోవాల‌ని భావిస్తుంది. ఈ భామ ముంబైలో ఖ‌రీదైన ప్లాట్‌ను కొనుగోలు చేసిన‌ట్టు బీటౌన్‌ నుండి సమాచారం.

ఇంత‌కుముందు ర‌ష్మిక ముంబై వెళ్లిన‌ప్పుడు హోట‌ల్స్ లో ఉండేది. ఇపుడు సొంత‌ ఇల్లు ఏర్పర్చుకున్నాక ఆనందంతో మునిగితేలుతుంది. ఇంకా మిష‌న్ మ‌జ్ను చిత్రం త‌ర్వాత డెడ్లీ ప్రాజెక్టు చేయ‌నుంది ర‌ష్మిక‌. ఈ మూవీలో బాలీవుడ్ సూప‌ర్ ‌స్టార్ అమితాబ్‌బచ్చ‌న్ లీడ్ రోల్‌లో న‌టించ‌బోతున్నారు. తెలుగులో ర‌ష్మిక న‌టిస్తోన్న పుష్ప చిత్రం ఆగ‌స్టులో రిలీజ్ కానుంది. మొత్తానికి అటు బాలీవుడ్ లో కూడా తన హ‌వా చూపించాలనుకొంటోంది ర‌ష్మిక‌.

ముంబైలో కాస్టలీ ప్లాట్ కొన్న ర‌ష్మిక..!!‌
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts