మెగా ఛాన్స్ ప‌ట్టేసిన ర‌ష్మిక‌..ల‌క్కీ బ్యూటీ ల‌క్ అదిరిపోయిందిగా?

February 18, 2021 at 11:31 am

ర‌ష్మిక మంద‌న్నా.. తెలుగులో ప్ర‌స్తుతం అల్లు అర్జున్ స‌ర‌స‌న పుష్ప‌, తమిళంలో కార్తి స‌ర‌స‌న‌ సుల్తాన్, హిందీలో సిద్ధార్థ మల్హోత్రా స‌ర‌స‌న‌ మిష‌న్ మ‌జ్ను చిత్రాల‌తో పాటు మ‌రికొన్ని ప్రాజెక్ట్స్ కూడా లైన్ పెట్టి ఫుల్ బిజీగా మారిన సంగ‌తి తెలిసిందే. అతి త‌క్కువ స‌మ‌యంలో సూప‌ర్ క్రేజ్ ఏర్ప‌ర్చుకున్న ర‌ష్మిక‌.. స్టార్ హీరోల‌కు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిపోయింది.

ఇదిలా ఉంటే.. తాజాగా ఈ ల‌క్కీ బ్యూటీ మ‌రో ల‌క్కీ ఛాన్స్ వ‌రించిన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబోలో త్వ‌ర‌లోనే ఈ తెర‌కెక్క‌నున్న సంగ‌తి తెలిసిందే. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీగా బ‌డ్జెట్‌తో దిల్‌ రాజు నిర్మించబోతున్నారు.

అయితే ఈ సినిమాలో చెర్రీకి జోడీగా ర‌ష్మికను ఎంపిక చేయాల‌ని డైరెక్ట‌ర్ శంక‌ర్ మ‌రియు నిర్మాత దిల్ రాజు భావిస్తున్నార‌ట‌. ఇందులో భాగంగా.. ఇప్ప‌టికే ర‌ష్మికతో సంప్ర‌దింపులు జ‌రుపుతున్న‌ట్టు టాక్‌. ఇక మ‌రోవైపు ఈ సినిమా సంగీత బాధ్యతలను అనిరుధ్‌కు అప్పగిస్తున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

మెగా ఛాన్స్ ప‌ట్టేసిన ర‌ష్మిక‌..ల‌క్కీ బ్యూటీ ల‌క్ అదిరిపోయిందిగా?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts