ఇంటికి చేరే ముందే ప్ర‌మాదం.. దంప‌తులు మృతి

February 23, 2021 at 9:05 am

మ‌రికొద్ది క్ష‌ణాలు గ‌డిస్తే దంప‌తులిద్ద‌రూ ఇంట్లోకి చేరుకునేవారు. అంత‌లోనే ఓ టిప్ప‌ర్ దూసుకొచ్చింది. మద్యం మత్తులో ఉన్న డ్రైవర్‌ నిర్లక్ష్యం కార‌ణంగా వారిద్ద‌రిని ఢికొట్టింది. దీంతో అక్క‌డిక‌క్క‌డే వారు మృతి చెందారు. ఈ సంఘ‌ట‌న అల్వాల్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో జ‌రిగింది. వివ‌రాల్లోకి వెళ్లితే.. నేపాల్‌లోని డాంగ్‌ జిల్లా పప్పారి గ్రామానికి చెందిన రూమ్‌లాల్‌ బండారి (40) మీనాదేవి బండారి (35) ఏడేళ్ల క్రితం పొట్ట‌కూటి కోసం హైద‌రాబాద్‌కు వలస వచ్చారు. వారి బంధువు బలరామ్‌ సునార్తో కలిసే అల్వాల్‌ ప్రాంతంలోని దేవుని అల్వాల్‌ శివాలయం రోడ్డులో స్థిరపడ్డారు. అక్క‌డే ఆ ముగ్గురూ క‌లిసి స్థానికంగా పాస్ట్‌ఫుడ్‌ సెంటర్ నిర్వ‌హిస్తున్నారు. అయితే గత ఏడాది లాక్‌డౌన్‌లో వారి వ్యాపారం మూతపడింది. దీంతో కొన్ని నెలలు స్వదేశానికి వెళ్లిపోయారు.

ఇదిలా ఉండ‌గా.. తిరిగి ప‌రిస్థితుల‌న్నీ చ‌క్క‌బ‌డుతుండ‌డంతో దంప‌తులిద్ద‌రూ ఇటీవలే తమ ఇద్దరు పిల్లల్ని తల్లిదండ్రుల వద్ద విడిచిపెట్టిన తిరిగి అల్వాల్‌ వచ్చాడు. రోజువారీగా ఆదివారం రాత్రి 11 గంటల ప్రాంతంలో వ్యాపారం ముగించుకుని నడుచుకుంటూ ఇంటికి తిరిగి వెళ్తున్నారు. శివాలయం రోడ్డు మూల మలుపు వద్దకు రాగానే వారిని వెనక నుంచి వేగంగా వచ్చి ఓ టిప్పర్ ఢికొంది. దీంతో భార్యాభర్తలు ఇద్దరూ అక్కడికక్కడే చనిపోయారు. వారికి కాస్త దూరంగా ఉన్న బంధువుకు మాత్రం ప్రమాదం తప్పింది. మద్యం మత్తులో ఉన్న డ్రైవర్‌ టిప్పర్‌ను నిర్లక్ష్యంగా నడ‌ప‌డం వ‌ల్లే ప్ర‌మాదం సంభ‌వించింద‌ని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. మలుపు వద్ద ఎదురుగా వచ్చిన ప్యాసింజర్‌ ఆటోను తప్పించేందుకు స‌డ‌న్ బ్రేక్ వేయ‌గా మొరం లోడుతో ఉన్న‌ లారీ అదుపుతప్పి ఎడమ వైపున రోడ్డు ప‌క్క‌న న‌డిచి వెళ్తున్న దంప‌తుల‌పై పడిపోయిందని వివరిస్తున్నారు. కేసు ద‌ర్యాప్తు చేస్తున్నామ‌ని, ఈసీఐఎల్అ శోక్‌నగర్‌కు చెందిన టిప్పర్‌ డ్రైవర్‌ కె.నర్సింహ్మను (59) అదుపులోకి తీసుకున్నామ‌ని వెల్ల‌డించారు. కేసును న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేసు్త‌న్నామ‌ని వెల్ల‌డించారు. నర్సింహ్మను అరెస్టు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

ఇంటికి చేరే ముందే ప్ర‌మాదం.. దంప‌తులు మృతి
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts