
టాలీవుడ్ ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంత అక్కినేని గత సంవత్సరం జాను అనే మూవీతో ప్రేక్షకులని పలకరించారు.ఈ మూవీ తర్వాత సమంత సినిమా ఏది ప్రేక్షకుల ముందుకు రాలేదు. మధ్యలో సామ్ జామ్ అనే షోతో పలకరించిన సమంత ది ఫ్యామిలీ మ్యాన్ 2 అనే వెబ్ సిరీస్‌లోను నటించింది. ఈ వెబ్ సిరీస్ ఫిబ్రవరిలో రిలీజ్ కావలసి ఉంది కానీ, పలు కారణాల వలన సమ్మర్‌కు వాయిదా పడిపోయింది. సీనియర్ దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కించబోయే శాకుంతలంలో సమంత మెయిన్ లీడ్ చేస్తుందని మేకర్స్ కొద్ది రోజుల క్రితమే ప్రకటించారు.
ఇప్పుడు తాజాగా ఆ సినిమాకి సంబందించిన క్రేజీ అప్డేట్ ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. మార్చి 20 నుండి ఈ మూవీ షూటింగ్ జరగనుందని, చిత్రాన్ని తెలుగు, తమిళంతో పాటు హిందీ భాషలలోను రిలీజ్ చేయనున్నట్టు సమాచారం. విభిన్నమైన పౌరాణిక ప్రణయ గాథగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. తన పది ఏళ్ల కెరీర్ లో మొదటిసారి సమంత పౌరాణిక పాత్రలో నటించబోతుంది.