నానీని హ‌త్తుకున్న ఆ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

February 26, 2021 at 11:11 am

న్యాచుర‌ల్ స్టార్ నాని ప్ర‌స్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో `శ్యామ్ సింగ‌రాయ్‌` ఒక‌టి. టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వ‌హిస్తున్న ఈ చిత్రం పీరియాడిక్ డ్రామాగా తెరకేక్కుతోంది. నిహారిక ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై వెంక‌ట్ బోయ‌న‌ప‌ల్లి ఈ చిత్రాన్ని భారీ బ‌డ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

అయితే ఇటీవ‌ల నాని బ‌ర్త్‌డే కానుక‌గా ఈ సినిమా ఫ‌స్ట్ లుక్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌లో పక్క పాపిడితో మీసాలు మెలితిప్పి డిఫ‌రెంట్‌ లుక్‌లో నాని క‌నిపించాడు. అంతేకాదు సంప్ర‌దాయ వ‌స్త్ర‌ధార‌ణ‌లో ఉన్న ఓ యువ‌తి ఫేస్ ‌క‌నిపించ‌కుండా నానీని వెనుక నుంచి హ‌త్తుకుని ఉండ‌టం ఈ పోస్ట‌ర్‌లో క‌నిపిస్తుంది.

ఇంత‌కీ నానీని వెనుక నంచి హ‌గ్ చేసుకున్న యువ‌తి ఎవ‌ర‌న్న‌ది చిత్ర యూనిట్ రివిల్ చేయ‌లేదు. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం.. ఆ యువ‌తి సాయి ప‌ల్ల‌వి అని తెలుస్తోంది. ఇక కోల్‌క‌తా నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో క్లాసిక్ గెటప్పులే కాదు.. కథ కూడా అంతే ఇంట్రెస్టింగ్ గా ఉండనుందని స‌మాచారం. కాగా, ఈ చిత్రంలో సాయి ప‌ల్ల‌వి, కృతి శెట్టి మ‌రియు మడోనా సెబాస్టియన్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు.

నానీని హ‌త్తుకున్న ఆ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts