భర్త కు ఆ పాటను అంకితం చేసిన సునీత…!?

February 27, 2021 at 3:04 pm
sunitha

రెండో వివాహం చేసుకున్న తర్వాత రోజూ వార్తల్లోనే ఉంటూ వస్తుంది ప్రముఖ సింగర్ సునీత. తన పిల్లల అంగీకారంతోనే రెండో పెళ్లి చేసుకుంది సునీత. ప్రస్తుతం భర్త రామ్ వీరపనేనితో కలిసి హాయిగా కొత్త జీవితం సంతోషంగా గడుపుతుంది సునీత. రామ్, పిల్లల మధ్య ఉన్న బంధం విషయంలో కూడా తాను చాలా సంతృప్తిగా ఉన్నట్లు చెప్పు కొచ్చింది ఈమె. ఇప్పుడు సునీత పిల్లలకి కూడా తన ఆస్తుల్లో వాటా ఇవ్వాలని రామ్ వీరపనేని భావిస్తున్నారట. అంతేకాకుండా ఇద్దరు పిల్లలను కూడా తన వ్యాపారాల్లోకి తీసుకురావాలని చూస్తున్నాడు రామ్. సోషల్ మీడియాలో వస్తున్న ఈ వార్తలు చూసి సునీత అభిమానులు ఎంత మంచివాడు మీకు తోడుగా దొరికాడు అంటూ రామ్ వీరపనేని పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ఇంక తాజాగా తన భర్తకు మంచి పాటను అంకితం ఇచ్చేసింది సునీత. కెరీర్‌లో వేల పాటలు పాడిన ఈమె, తన భర్తకు ఎలాంటి పాట అంకితం ఇచ్చిందా అని ఆలోచిస్తున్నారు . ఈ మధ్యే ప్రదీప్ సినిమాలో పాడిన పాటను భర్తకు అంకితం ఇచ్చేసింది సునీత. నీలినీలి ఆకాశంలోని రెండో చరణం సునీత పాడింది.ఓహో అమ్మ చూపులో ఒలికే జాలి నువ్వులే, ఆ జాలికి మారుగా ఏమి ఇవ్వాలే నాన్న వేలితో నడిపే ధైర్యమే నీది ,నీ పాపనై పసి పాపనై ఏమి ఇవ్వాలి, దయ కలిగిన దేవుడే మనలను కలిపాడులే, వరమసగే దేవుడికి నేను ఏం తిరిగివ్వాలి…అంటూ భర్తను తలుచుకుని పాట పాడింది సునీత. ఒక్క ఈవెంట్లో ఈ పాట పాడుతున్నపుడు ఎమోషనల్ అయిపోయి ఏడ్చేసింది సునీత. అక్కడ తన భర్త కోసం ఈ పాట పాడింది. ఏదేమైనా కూడా పెళ్లి తర్వాత హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తుంది మన సింగర్ సునీత.

భర్త కు ఆ పాటను అంకితం చేసిన సునీత…!?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts