ఆక‌ట్టుకుంటున్న ‘సీత ఆన్ ది రోడ్’ ట్రైలర్!

February 26, 2021 at 12:45 pm

`సీత ఆన్ ది రోడ్` ప్రనీత్ యారోన్ అనే యువ దర్శకుడు తెర‌కెక్కిస్తున్న కొత్త ప్ర‌య‌త్న‌మే ఈ చిత్రం. ఒకరితో ఒకరికి సంబంధం లేని ఐదుగురు అమ్మాయిలు జీవితాల్లో జరిగిన సంఘటనలు, వారికి ఎదురైన స‌వాళ్లు అంద‌రికీ కనెక్ట్ అయ్యేలా కాస్త బోల్డ్‌గా ఈ చిత్రాన్ని రూపొందించారు.

అయితే తాజాగా ఈ సినిమా ట్రైల‌ర్ విడుద‌ల అయింది. సమాజంలో స్త్రీ మనుగడ ఏ విధంగా ఉంది..కట్టుబాట్లు, సాంప్రదాయాల ఉచ్చులో మహిళ ఎలా నలిగిపోతుందన్న విష‌యాలు ఈ సినిమాలో ప్ర‌స్తావించ‌నున్నార‌ని ట్రైల‌ర్ బ‌ట్టీ అర్థం అవుతోంది.

ఇక‌ ఈ ట్రైలర్‌లో కనిపించే ఐదుగురు అమ్మాయిల్లో గాయిత్రీ గుప్తా,కల్పిక గణేష్‌ తప్ప మిగిలిన నటీమణులు కొత్తనటులే అయినప్పటికీ అద్భుతంగా న‌టించాడు. అలాగే బ్యాక్ గ్రౌండ్ మ్యుజిక్ కూడా ఆక‌ట్టుకుంటోంది. మొత్తానికి ఈ ట్రైల‌ర్ ఆధ్యంతం ఆక‌ట్టుకోవ‌డంతో పాటు సినిమాపై అంచ‌నాలు కూడా పెంచేసింది. కాగా, ఈ చిత్రం మార్చి 5న విడుద‌ల కానుంది.

ఆక‌ట్టుకుంటున్న ‘సీత ఆన్ ది రోడ్’ ట్రైలర్!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts