
కరోనా వైరస్ ముఖ్యంగా తుమ్మడం, దగ్గడం, చీదడం ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మాస్క్‌లను ధరించాలని, శానిటైజేషన్ చేపట్టాలని వైద్యులు సూచిస్తున్నారు. అయితే వైరస్ ఉన్న లాలాజల బిందువులు ఒకే సారి ఆరిపోవని, అవి వేర్వేరు సమయాల్లో, వేర్వేరు పరిస్థితులతో ముడిపడి ఉంటుంది. ముఖ్యంగా సాధారణ గాజుతో పోల్చితే స్మార్ట్ ఫోన్ తెరపైనే వైరస్ జీవితకాలం మూడురెట్లు అధికమట. ఇదే విషయాన్ని ఐఐటీ హైదరాబాద్‌కు చెందిన శాస్త్రవేత్తలు నిర్ధారించారు. తుంపర్లలోని తడి ఆరిపోయిన తర్వాత వైరస్ వ్యాప్తి చెందే అవకాశం చాలా తక్కువని వారి తాజా అధ్యయనం వెల్లడించిండం విశేషం.
విభిన్న వాతావరణ పరిస్థితుల్లో కోవిడ్ కారక కరోనా వైరస్ మనుగడ సాగిస్తున్న తీరును అధ్యయనం చేసే దిశగా పరిశోధన శాస్త్రవేత్తల బృందానికి నేతృత్వం వహించిన ఐఐటీ హెచ్ మెకానికల్, ఏరో స్పేస్ విభాగం ప్రొఫోసర్ శరవణ్ బాలుసామి వెల్లడించారు. అయితే సాధారణ నీటితో పోల్చినప్పుడు లాలాజలంలో నీటితో పాటు లవణాలు, ముసిన్ అనే ప్రొటీన్ తదితరాలు ఉంటాయని, వాటి వల్లే లాలాజలం ఆరిపోయేందుకు అధిక సమయం పడుతున్నట్లు గుర్తించామన్నారు. సాధారణంగా తుంపర్లు కొన్ని నిమిషాల్లోనే ఆరిపోతాయని, గాల్లో తేమ శాతం ఎక్కువైతే గంట కంటే ఎక్కువ సమయం పడుతుందని వివరించారు. అదీగాక ‘తుంపర బిందువులు ఏ ఉపరితలంపై పడ్డాయన్న అంశంపై కూడా ఆరిపోయే సమయం ఆధారపడి ఉంటుంది. గాల్లో తేమ శాతం, ఉష్ణోగ్రతలు తక్కువ గా ఉంటే ఎక్కువ సమయం, తక్కువగా ఉంటే అతివేగంగా బిందువులు ఆరిపోతున్నట్లు కనుగొన్నామని వివరించారు. దీనిని దృష్టిలో అన్ని ప్రాంతాలను ఒకే రీతిన శుబ్రం చేయకూడదని, ఏసీలు అమర్చిన గదులను ఎక్కువగా శానిటైజ్ చేయాలని సూచించారు.