బాలీవుడ్ స్టార్ షారూఖ్ కూతురు పై ట్రోలింగ్..!!

February 26, 2021 at 1:27 pm

సోష‌ల్ మీడియా వేదిక‌గా సెల‌బ్రిటీల‌నే కాకుండా వారి కుటుంబ స‌భ్యుల‌ను కూడా ట్రోలింగ్ చేయ‌డం నెటిజ‌న్స్‌కు ఈ మధ్య మాములు అయిపొయింది.. తాజాగా బాలీవుడ్ స్టార్ షారూఖ్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్‌ని బూతులు తిడుతూ కొంద‌రు ట్రోల్ చేశారు. దీనిపై సుహానా సున్నితంగా కౌంట‌ర్ ఇచ్చింది. అసలు వివరాల్లోకి వెళ్ళితే, సుహాన కొన్నాళ్ల క్రితం కొంచెం నల్లగా కనిపించేది. తెల్లగా కనిపించడం కోసం ఆమె ఆపరేషన్ చేయించుకుని, కాస్త అందంగా మారిన త‌ర్వాత త‌ర‌చు ఫొటో షూట్స్ చేస్తూ వాటిని సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వచ్చింది.

అయితే సుహానా ఫొటోల ‌పై కొంద‌రు నెటిజ‌న్స్ స్పందించి, నువ్వు ఇప్పుడు అందంగా కాకుండా అబ్బాయిలా క‌నిపిస్తున్నావ‌ని, చూడ్డానికి అసహ్యంగా ఉన్నావ‌ని కామెంట్స్ పెడుతున్నారు. వీటిని స్క్రీన్ షాట్ తీసి త‌న సోషల్ మీడియాలో షేర్ చేసిన సుహానా, ఎల్లపుడు ఒకేలా ఉండటం కుదరదు. పెద్ద‌గా మారిన త‌ర్వాత మ‌న‌లో చాలా మార్పులు వ‌స్తాయి. అంతే కానీ ఇలా ఇష్టం వచ్చినట్లు కామెంట్ చేయ‌డం మంచిది కాదంటూ సుహానా చాలా కూల్‌గా చెప్పింది.

బాలీవుడ్ స్టార్ షారూఖ్ కూతురు పై ట్రోలింగ్..!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts