బిగ్ బితో సూరజ్ బర్జాత్యా ఊంచాయి..!!

February 26, 2021 at 12:18 pm

ఈ మధ్య హీరో అంటే 25 ఏళ్ల కుర్రాడు అయ్యి ఉండనవసరం లేదు. బాలీవుడ్ లో క్రమేపి రూల్స్ మారుతున్నాయి. దర్శకుడు సూరజ్ బర్జాత్యా ఓ మూవీ ప్లాన్ చేశాడు. అందులో ఇద్దరు హీరోలు. వారిద్దరూ సీనియర్ యాక్టర్లు కాగా, మూడో వ్యక్తి కూడా ఈ మూవీ టీమ్ లో జాయిన్ అయ్యాడు. వారు అమితాబ్, బొమన్ ఇరానీ, అనుపమ్ ఖేర్ స్టారర్. సూరజ్ బర్జాత్యా అనగానే హమ్ ఆప్కే హై కౌన్, హమ్ సాథ్ సాథ్ హై లాంటి చిత్రాలు మనకి గుర్తుకు వస్తాయి. అయితే, సాధారణంగా కుటుంబ కథా చిత్రాలు డైరెక్ట్ చేసే ఆయన ఈసారి స్నేహం పై దృష్టి సారించారు. అదీ ఇద్దరు ముసలాళ్ల మధ్య ఉన్న స్నేహం గురించి కథ చెప్పబోతున్నాడట. నిజానికి అమితాబ్ బచ్చన్, బొమన్ ఇరానీ ప్రధాన పాత్రల్లో నటించే బర్జాత్యా మూవీ ఈ ఫిబ్రవరీలోనే షురూ కావాల్సింది. కానీ, కొన్ని అనివార్య కారణాలతో వాయిదా పడుతూ సెప్టెంబర్ కి వెళ్లిపోయింది. సూరజ్ బర్జాత్యా ఆఖరి రిలీజ్ అయిన చిత్రం ప్రేమ్ రతన్ ధన్ పాయో.

తన రెగ్యులర్ హీరో సల్మాన్ కి జోడీగా సోనమ్ కపూర్ తో ఆయన ఈ చిత్రాన్ని తీశారు. అయితే, అది ఆశించినంత ఫలితం ఇవ్వలేదు. ఈసారి సల్మాన్ తో కాకుండా బిగ్ బి, బొమన్ తో సినిమా ప్లాన్ చేశాడు బర్జాత్యా. ఇప్పటికే టైటిల్ కూడా ఫిక్స్ అయ్యి అనౌన్స్ కూడా చేసారు. ఊంచాయి అనే పేరుతో ఈ చిత్రం తెరకెక్కుతుందట. ఊంచాయి అంటే హిందీలో ఎత్తు లేదా అభివృద్ధి అని అర్థం వస్తుంది. మానవ సంబంధాలకు ప్రాముఖ్యతనిచ్చే డైరెక్టర్ సూరజ్ బర్జాత్యా తన నెక్ట్స్ మూవీలో కూడా హ్యూమన్ డ్రామానే చూపిస్తాడని టాక్. అయితే, లెటెస్ట్ సమాచారం ప్రకారం అమితాబ్, బొమన్ ఇరానీతో పాటూ అనుపమ్ ఖేర్ కూడా ఊంచాయి చిత్రంలో ఒక కీలక పాత్ర పోషిస్తాడట. ముగ్గురు లేదా నలుగురు స్నేహితుల మధ్య ఈ కథ తిరగవచ్చని టాక్. ఈసారి డిఫరెంట్ అటెంప్ట్ చేస్తోన్న డైరెక్టర్ ఎంత వరకూ సక్సెస్ అవుతాడో వేచి చూడాల్సిందే.

బిగ్ బితో సూరజ్ బర్జాత్యా ఊంచాయి..!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts