
బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ ప్రస్తుతం పలు సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. దివంగత నటి, తమిళనాడు ముఖ్యమంత్రిగా పని చేసిన జయలలిత జీవిత నేపథ్యంలో తలైవీ అనే సినిమా చేయగా, ఈ చిత్రాన్ని తమిళ దర్శకుడు ఏఎల్ విజయ్ తెరకెక్కించారు. కరోనా లాక్ డౌన్ తర్వాత ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేశారు. ఇప్పటి వరకు ఈ సినిమాకి సంబంధించి రిలీజ్ అయిన పలు ప్రచార చిత్రాలు బాగా ఆకట్టుకున్నాయి. ఈ చిత్రాన్ని జయలలిత జయంతి సందర్భంగా ఏప్రిల్ 23న రిలీజ్ చేయనున్నట్టు మూవీ మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రంలో కంగనా తన నట విశ్వ రూపంతో ప్రేక్షకుల అందరిని కట్టిపడేస్తుందని మేకర్స్ గెట్టిగా చెప్తున్నారు. ఏప్రిల్‌లో విడుదల కానున్న కంగనా తలైవీ.
ఇక పోతే, పొలిటికల్ డ్రామాగా తెరకెక్కనున్న ప్రతిష్టాత్మక చిత్రంలో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్రలో అలరించనున్న సంగతి తెలిసిందే. మరో వైపు ధాకడ్ అనే చిత్రం కూడా కంగనా చేస్తుంది. లేడీ ఓరియెంటెడ్‌గా సాగే యాక్షన్ చిత్రమిదని చెప్పిన కంగనా, భారతీయ సినిమాలో ఉత్తమ చిత్రాల్లో ఒకటిగా ఈ చిత్రం నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది మొన్న ఆ మధ్య. రజనీష్ ఘాయ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ధాకడ్ చిత్రంలో మిమోహ్ చక్రవర్తి, మనోజ్ తివారి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కథా రచయిత రితేష్‌షా, నిర్మాత సొహెయిల్ మక్లాయ్ ఈ సినిమాకి పని చేస్తున్నారు. అక్టోబర్ 1న ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు మేకర్స్.