ముగింపు పలికిన తుది దశ పోలింగ్..!?

February 21, 2021 at 5:00 pm
elections

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు ప్రశాంతగా సాగుతున్నాయి. ఈ తరుణంలో ఆదివారం నాలుగో దశ ఎన్నికల పోలింగ్ జరుగనుంది. మధ్యాహ్నం ఓటింగ్‌ ముగిసే సమయానికి శ్రీకాకుళం 78.81, విజయనగరం 85.60, విశాఖ 84.07, తూర్పు గోదావరి 74.99, పశ్చిమ గోదావరి జిల్లాలో 79.03, కృష్ణా 79.29, గుంటూరు 76.74, ప్రకాశం 78.77, నెల్లూరు 73.20, చిత్తూరు 75.68, కర్నూలు 76.52, అనంతపురం 82.26, వైఎస్‌ఆర్‌ జిల్లాలో 80.68 శాతం పోలింగ్‌ నమోదైంది. నాలుగో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ ఆంధ్రప్రదేశ్‌లో ప్రశాంతంగా కొనసాగుతోంది. ఎన్నికల పోలింగ్ మధ్యాహ్నం 12:30 వరకు 66.60 శాతం నమోదైనట్లు ఎన్నికల అధికారులు పేర్కొన్నారు.

elections

elections

ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీ ఎన్నికల తుది విడత పోలింగ్‌ లో ఆదివారం 161 మండలాల పరిధిలో 2,743 సర్పంచి స్థానాలకు ఎన్నికలు జరుగనుండగా మొత్తం 7,475 మంది అభ్యర్ధులు పోటీ పడుతున్నారు. ఆఖరి విడతలో 33,435 వార్డులకుగానూ 10,921 చోట్ల ఏకగ్రీవంగా ముగిశాయి. మరో 91 చోట్ల వార్డు పదవులకు నామినేషన్లు దాఖలు కాకపోవడంతో 22,423 వార్డులకు నేడు పోలింగ్‌ జరగనుంది. వార్డు పదవులకు 52,700 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.

ఏపీ గ్రామ పంచాయతీ తుది విడతలో 161 మండలాల పరిధిలో 2,743 సర్పంచి స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా మొత్తం 7,475 మంది అభ్యర్ధులు పోటీ పడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీ ఎన్నికలు నాలుగు విడతల్లో నిర్వహించేలా నోటిఫికేషన్లు జారీ కావడం తెలిసిందే. ఆఖరి విడతలో 3,299 పంచాయతీల్లో ఎన్నికలకు నోటిఫికేషన్లు జారీ కాగా 554 సర్పంచి పదవులు ఏకగ్రీవమయ్యాయి.

ఇక వైఎస్సార్‌ జిల్లాలో రెండు చోట్ల సర్పంచి పదవికి ఒక్కరు కూడా నామినేషన్‌ దాఖలు చేయకపోవడంతో ఆదివారం 2,743 చోట్ల ఎన్నికలు జరుగుతున్నాయి. ఆఖరి విడతలో 33,435 వార్డులకుగానూ 10,921 చోట్ల ఏకగ్రీవంగా ముగిశాయి. మరో 91 చోట్ల వార్డు పదవులకు నామినేషన్లు దాఖలు కాకపోవడంతో 22,423 వార్డులకు నేడు పోలింగ్‌ జరగనుంది. వార్డు పదవులకు 52,700 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. సాయంత్రం 3.30 గంటల వరకు పోలింగ్‌ నిర్వహించి అదే రోజు 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపడతారు.

ముగింపు పలికిన తుది దశ పోలింగ్..!?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts