
నేటి సమాజంలో చాల మంది సోషల్ మీడియాను ఎక్కవగా వాడుతున్నారు. తాజాగా సోషల్ మీడియాపై బీజేపీ నేత రామ్‌మాధవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక ప్రభుత్వాలనే గద్దె దించే సత్తా సోషల్ మీడియాకు ఉన్నదని అన్నారు బీజేపీ నేత రామ్‌మాధవ్. దీని ప్రభావం చాలా ఉన్నదని, ఇది ప్రజాస్వామ్యాన్ని బలహీనం చేసి, అరచకానికి దారి తీసేలా చేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. దీనిని నియంత్రించడానికి ప్రస్తుత చట్టాలు సరిపోవడం లేదని, అందుకే భారత ప్రభుత్వం కొత్త చట్టం తీసుకొచ్చే పనిలో ఉన్నదని రామ్‌మాధవ్ వెల్లడించారు. తన కొత్త పుస్తకం బికాజ్ ఇండియా కమ్స్ ఫస్ట్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
అంతేకాదు.. రాజకీయేతర, రాజ్యేతర శక్తులతో ప్రజాస్వామ్యం కొత్త సవాళ్లను ఎదుర్కొంటోందని రామ్‌మాధవ్ అన్నారు. సోషల్ మీడియా ఎంత శక్తవంతమైనదంటే అది ప్రభుత్వాలనే కూల్చేయగలదు. వాటికి హద్దులంటూ ఏమీ లేకపోవడంతో నియంత్రించడం కష్టమవుతోంది. ఈ శక్తులు అరాచకానికి దారితీస్తాయి. మన రాజ్యాంగంలోనే పరిష్కారాలు ఉన్నాయి అని రామ్‌మాధవ్ అన్నారు. ట్విటర్‌తో కేంద్ర ప్రభుత్వం ఘర్షణ నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.